INDvsAUS: మొదటి టీ20లో టీమిండియా ఘనవిజయం... అదరగొట్టిన బౌలర్లు...

Published : Dec 04, 2020, 05:29 PM ISTUpdated : Dec 04, 2020, 06:49 PM IST

INDvAUS 1st T20I: ఆఖరి వన్డేలో దక్కిన ఓదార్పు విజయం టీమిండియాకి రెట్టింపు బూస్ట్ ఇచ్చినట్టు ఉంది. మొదటి టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తప్ప అందరూ ఫెయిల్ అయినా, బౌలింగ్‌లో మాత్రం టీమిండియా అదరగొట్టింది. మొట్టమొదటి టీ20 ఆడుతున్న నటరాజన్‌తో పాటు జడ్డూ ప్లేస్‌లో 12వ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చిన యజ్వేంద్ర చాహాల్ చెలరేగి ఆసీస్‌ను కుప్పకూల్చారు.

PREV
113
INDvsAUS: మొదటి టీ20లో టీమిండియా ఘనవిజయం... అదరగొట్టిన బౌలర్లు...

ఓపెనర్లు ఆరోన్ ఫించ్, ఆర్కీ షార్ట్ కలిసి దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. మొదటి ఓవర్‌లోనే 14 పరుగులు రాగా, 7.3 ఓవర్లలో 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

213

రవీంద్ర స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చిన యజ్వేంద్ర చాహాల్, భారత జట్టుకి తొలి బ్రేక్ అందించాడు...

313

ఆరోన్ ఫించ్, ఆర్కీ షార్ట్ ఇచ్చిన సులవైన క్యాచ్‌లను భారత ఫీల్డర్లు జారవిరిచారు. కెప్టెన్ కోహ్లీ కూడా ఓ ఈజీ క్యాచ్‌ను నేలపాలు చేశాడు.

413

అయితే చాహాల్ బౌలింగ్‌లో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్న హార్ధిక్ పాండ్యా, 26 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన ఫించ్‌ను పెవిలియన్ చేర్చాడు...

513

ఆ తర్వాత సూపర్ ఫామ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ కూడా 9 బంతుల్లో 12 పరుగులు చేసి చాహాల్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు...

613

డేంజరస్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని నటరాజన్ అవుట్ చేశాడు. 3 బంతుల్లో 2 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్, నటరాజన్‌కి టీ20ల్లో మొట్టమొదటి వికెట్‌గా వెనుదిరిగాడు...

713

38 బంతుల్లో 3 ఫోర్లతో 34 పరుగులు చేసిన ఓపెనర్ ఆర్కీ షార్ట్ కూడా నటరాజన్ బౌలింగ్‌లో పాండ్యాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

813

మాథ్యూ వేడ్ కూడా యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లోనే అవుట్ కావడంతో విజయానికి 40 పరుగులు కావాల్సిన సమయంలో ఐదో వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా...

913

రవీంద్రజడేజా స్థానంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా వచ్చిన యజ్వేంద్ర చాహాల్ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు...

1013

హెండ్రిక్స్ 20 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసి దూకుడు కనబరిచాడు. అయితే చాహార్ బౌలింగ్‌లో హెండ్రిక్స్ అవుట్ కావడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది.

1113

నేటి మ్యాచ్‌తో టీ20 ఆరంగ్రేటం చేసిన టి నటరాజన్ తన మొదటి మ్యాచ్‌లోనే 3 వికెట్లు పడగొట్టాడు. 

1213

ఆస్ట్రేలియా విజయానికి ఆఖరి 5 ఓవర్లలో 49 పరుగులు కావాల్సి ఉండగా 37 పరుగులు చేసిన ఆసీస్ 3 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.

1313

162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. 11 పరుగుల తేడాతో టీమిండియాకి విజయం దక్కింది.

click me!

Recommended Stories