మీ నాన్నలో సగం ఆడినా నువ్వు గొప్పోడివే.. కానీ.. సచిన్ కొడుకుపై కపిల్ దేవ్ కామెంట్స్

Published : Jun 04, 2022, 03:59 PM ISTUpdated : Jun 04, 2022, 04:12 PM IST

Kapil Dev Advise To Arjun Tendulkar: టీమిండియా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్.. జాతీయ జట్టులో ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడా..? అని అతడి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

PREV
16
మీ నాన్నలో సగం ఆడినా నువ్వు గొప్పోడివే.. కానీ.. సచిన్ కొడుకుపై కపిల్ దేవ్ కామెంట్స్

సచిన్ వారసుడు అర్జున్ టెండూల్కర్ ను ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో ఆడించకపోవడంపై టెండూల్కర్ అభిమానులు ఒకింత నిరాశకు గురయ్యారు. అయితే  సచిన్ కొడుకు అవడం వల్లే అతడికి అవకాశాలు రావడం లేదని కొందరు వాపోతుండగా.. అతడు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని మరికొంతమంది అంటున్నారు. 

26

ఈ నేపథ్యంలో  భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియాకు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన  కపిల్ దేవ్ అర్జున్  పై స్పందించాడు. అతడింకా చిన్న కుర్రాడని.. ఒకవేళ క్రికెట్ లో అతడు రాణించాలని అనుకుంటే టెండూల్కర్  చేసినదానిలో 50 శాతం చేసినా సరిపోతుందని వ్యాఖ్యానించాడు. 

36

అన్ కట్ అనే మ్యాగజైన్ తో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘అందరూ అతడి (అర్జున్) గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అతడు సచిన్ టెండూల్కర్ కొడుకు. అర్జున్ ను సచిన్ తో పోల్చకండి. అతడి ఆటను అతడు ఆడుకోనివ్వండి. 

46

టెండూల్కర్ పేరు అతడి చివర ఉండటం వల్ల  అర్జున్ కు ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఆసీస్ దిగ్గజ క్రికెటర్ డాన్ బ్రాడ్మన్ కొడుకు.. తన తండ్రి పెట్టిన పేరును మార్చుకున్నాడు. అభిమానుల అంచనాలను ఒత్తిడిని తట్టుకోలేక అతడు తన పేరు చివరన సర్ బ్రాడ్మన్ ను తొలగించుకున్నాడు. 

56

అర్జున్ కూడా ఒత్తిడి చేయకండి. అతడు ఇంకా కుర్రాడు. సచిన్ అతడి తండ్రి అయినప్పుడు అర్జున్ కు ఇంకా ఆట గురించి చెప్పడానికి మనమెవరం..?

66

కానీ నేను అతడికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను.. ‘నీ ఆట నువ్వు ఆడు. ఎవరి దగ్గరా నువ్వు ప్రూవ్ చేసుకోవల్సిన అవసరం లేదు. మీ నాన్న ఆడిన ఆటలో సగం ఆడినా  అంతకుమించిన గొప్ప విషయం లేదు..’ టెండూల్కర్ పేరు వింటే మనకు మన ప్రమేయం లేకుండానే అర్జున్ మీద అంచనాలు పెరుగుతాయి. ఎందుకంటే సచిన్ ఆ బెంచ్ మార్క్ సెట్ చేశాడు కదా..’ అని చెప్పుకొచ్చాడు.

click me!

Recommended Stories