టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ డ్రా అయితే పరిస్థితి ఏంటి? విజేత ఎవరు... క్లారిటీ ఇచ్చిన ఐసీసీ..

టెస్టు ఫార్మాట్‌లో నిర్వహించిన మొట్టమొదటి మెగా సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్. ఫైనల్‌కి సమయం దగ్గరికి వస్తున్నకొద్దీ, అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులను వెంటాడుతున్న ప్రశ్న... ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే పరిస్థితి ఏంటి?

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే... టోర్నీలో అత్యధిక పాయింట్ల సాధించి టాప్‌లో ఉన్న టీమిండియాకే విజయం దక్కుతుందని కొందరు అంటుంటే, మరికొందరు టెస్టుల్లో కూడా వన్డే, టీ20ల్లోలా సూపర్ ఓవర్ నిర్వహిస్తారని మరికొందరు భావించారు.
అయితే ఎట్టకేలకు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే రిజల్ట్ ఎలా డిసైడ్ చేస్తారో ప్రకటించింది ఐసీసీ...

టెస్టుల్లో డ్రా మ్యాచులు సహజం. కాబట్టి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిస్తే... ఇరు జట్లు ఇండియా, న్యూజిలాండ్ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. అంటే ఐసీసీ టెస్టు టోర్నీ ఇద్దరికీ వస్తుందన్నమాట.
ఐదు రోజుల పాటు సాగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో వర్షం కారణంగా లేదా వెలుతురు సరిగా లేని కారణంగా లేదా మరేదైనా కారణంగా పూర్తి ఓవర్ల పాటు మ్యాచ్ సాగకపోతే, అదనంగా రిజర్వు డేలో ఫలితం కోసం పోరాడుతాయి ఇరుజట్లు.
అంటే రోజుకి 90 ఓవర్ల చొప్పున ఐదు రోజుల్లో 300 ఓవర్ల పాటు (ఫలితం తేలకపోతే) ఫైనల్ మ్యాచ్ జరగాలి. లేదంటే మొదటి రోజు నుంచి ఐదో రోజులోపు ఆటలో 20 ఓవర్లు తక్కువ వేసినా... వాటిని ఆరో రోజు రిజర్వు డేలో ఆడాల్సి ఉంటుంది.
అయితే టీమిండియా ఆడిన గత మ్యాచులను పరిశీలిస్తే, దాదాపు 80 శాతం మ్యాచులు మూడు రోజుల్లోనే ముగిశాయి. అలా చూస్తే ఐదు రోజుల పాటు పూర్తిగా మ్యాచ్ సాగడం చాలా కష్టమే. అయితే అలా సాగితే మాత్రం ఓ ఆసక్తికర ఫైట్ చూసే అదృష్టం ప్రేక్షకులకు దక్కుతుంది.
జూన్ 18 నుంచి ఇంగ్లాండ్‌లోని సౌంతిప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాతో పాటు కివీస్ కూడా హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది.
తన కెప్టెన్సీ కెరీర్‌లో ఒక్క ఐసీసీ టోర్నీ టైటిల్ కూడా గెలవలేకపోయిన విరాట్ కోహ్లీ, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలిచి ఆ కలను నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు.
మరోవైపు గత 15 ఏళ్లల్లో ఒక్క ఐసీసీ టోర్నీ ఫైనల్ కూడా గెలవలేకపోయిన న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్ గెలిచి, ఆ రికార్డును మెరుగుపర్చుకోవాలని చూస్తోంది.

Latest Videos

click me!