కోహ్లీ ఆ మ్యాచ్‌ను గుర్తు చేసుకోవాలి, భారత జట్టు అద్భుతాలు చేయగలదు... - సచిన్ టెండూల్కర్...

First Published Jun 16, 2021, 5:30 PM IST

ఇప్పుడు అసలు సిసలైన క్రికెట్ ఫ్యాన్స్ అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్. జూన్ 18 నుంచి ఇంగ్లాండ్‌లోని సౌంతిప్టన్‌లో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఐసీసీ నిర్వహిస్తున్న తొలి టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ కోసం భారత్, న్యూజిలాండ్ తలబడనున్నాయి...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత జట్టు అద్భుతాలు చేయగలదని అభిప్రాయపడ్డాడు ‘మాస్టర్’ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఆసీస్ టూర్‌లో భారత జట్టు ప్రదర్శన చూసి ఆశ్చర్యపోయానని చెప్పిన ఆయన, కోహ్లీ టీమ్‌పై తనకి అపారమైన నమ్మకం ఉందన్నారు.
undefined
‘బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 టూర్‌లో టీమిండియా పర్ఫామెన్స్ చూసి థ్రిల్ ఫీల్ అయ్యా. చాలామంది ప్లేయర్లు గాయాల కారణంగా దూరమైనా కుర్రాళ్లు అదరగొట్టారు. అలాంటి పర్ఫామెన్స్ వల్లే టీమిండియా ఫైనల్‌కి చేరుకోగలిగింది...
undefined
ఆస్ట్రేలియా టూర్‌ ప్రదర్శన టీమిండియాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసి ఉంటుంది. దాదాపు 10, 12 మంది ప్లేయర్లు గాయపడి తప్పుకున్నా విజయం సాధించారంటే అది సాధారణమైన విషయం కాదు..
undefined
ఇంతకుముందు విరాట్ కోహ్లీ ఆఫ్ స్టంప్‌కి అవతల వెళ్లే బంతులను వెంటాడానికి వెళ్లి, కోహ్లీ అవుట్ అయ్యేవాడు. అయితే ఇప్పుడు విరాట్ తన వీక్‌నెస్‌పై బాగా వర్కవుట్ చేసినట్టు ఉన్నాడు. అతను ఏ షాట్ ఆడుతున్నాడు, ఎన్ని పరుగులు చేస్తున్నాడని నేను పట్టించుకోను...
undefined
అయితే ఎన్ని షాట్లు కరెక్టుగా ఆడుతున్నాడు, ఎన్ని సార్లు అవుట్ అయ్యాడనే విషయాలను మాత్రం బాగా పట్టించుకుంటాను. మన లోపాలను గుర్తించినప్పుడే, వాటిని సరిదిద్దుకునేందుకు ఓ పరిష్కారం వెతకడం తేలికవుతుంది...
undefined
అయితే విరాట్ కోహ్లీ పర్ఫామెన్స్ చూస్తుంటే చాలా సంతృప్తికరంగా ఉంది. అతను న్యూజిలాండ్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఓపిగ్గా బ్యాటింగ్ చేయాలి... అతనికి ఎంతో సత్తా ఉంది. అంతకుమించి విరాట్ కోహ్లీ ఓ మంచి స్టూడెంట్.
undefined
అతనికి సొంతంగా ప్లాన్స్ ఉంటాయి. ఇంగ్లాండ్‌ పిచ్‌లపై షాట్స్ ఆడకుండా బంతిని వదిలేయడం కూడా కొన్నిసార్లు వర్కవుట్ కాకపోవచ్చు. కాబట్టి క్రీజులో సాధ్యమైనంత సేపు ఉండి ఏ బౌలర్‌పైన అటాక్ చేయాలనేది నిర్ణయించుకోవడం ముఖ్యం.
undefined
2004 ఆస్ట్రేలియా టూర్‌లో నేను నాకు ఎంతో ఇష్టమైన డ్రైవ్ షాట్ ఆడకూడదని నిర్ణయించుకున్నా. అది డ్రెస్సింగ్ రూమ్‌లో తీసుకున్న నిర్ణయం కాదు. పిచ్‌ను బట్టి, బౌలర్ల స్ట్రాటెజీని అర్థం చేసుకుని, అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం...
undefined
ఓపిగ్గా క్రీజులో పాతుకుపోతే బౌలర్లు కచ్ఛితంగా ఓపిక కోల్పోతారు. ఏ బౌలర్ ఓపిక నశించిందో పసికడితే, అతని బౌలింగ్‌లో షాట్స్ ఆడడం ఈజీ. రోహిత్ శర్మకు ఎక్కడ, ఎప్పుడు గేర్ మార్చాలో బాగా తెలుసు..
undefined
అతను సెహ్వాగ్‌లా మొదటి బంతి నుంచే షాట్స్ ఆడాలని అనుకోడు. కండీషన్స్‌ను అర్థం చేసుకుని, పిచ్‌ను, బౌలర్లను చదివిన తర్వాత దాడి చేయడం మొదలెడతాడు...’ అంటూ వివరించాడు సచిన్ టెండూల్కర్.
undefined
click me!