సచిన్‌ టెండూల్కర్ ఇప్పుడు ఆడి ఉంటే, వన్డేల్లోనే 100 సెంచరీలు చేసేవాడు... -సనత్ జయసూర్య

First Published | Nov 16, 2023, 5:43 PM IST

విరాట్ కోహ్లీ వన్డేల్లో 50వ సెంచరీ బాది, సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 వన్డే సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే వన్డే వరల్డ్ కప్‌లో సచిన్ పేరిట ఉన్న 673 పరుగుల రికార్డు కూడా విరాట్ ఖాతాలో చేరిపోయింది.. 

సచిన్ టెండూల్కర్ రికార్డులను ఒక్కొక్కటిగా బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు విరాట్ కోహ్లీ. దీంతో సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీ గొప్ప క్రికెటర్ అనే వాదన తెరపైకి వస్తోంది..

సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 463 వన్డేలు ఆడి 49 సెంచరీలు చేస్తే, విరాట్ కోహ్లీ 291 వన్డేల్లోనే 50 సెంచరీలు అందుకున్నాడు. అయితే తరాలు మారినా, సచిన్ టెండూల్కర్ గ్రేటెస్ట్ బ్యాటర్ అంటున్నాడు శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య...
 


‘వన్డేల్లో 2 బంతులు వాడొచ్చనే నిబంధన వచ్చింది. 30 ఓవర్ల తర్వాత కొత్త బంతి వస్తుంది. దీని వల్ల రివర్స్ స్వింగ్ రాబట్టడం కష్టమైంది. 

పవర్ ప్లే, డీఆర్‌ఎస్ వంటి మార్పుల కారణంగా బ్యాటర్లకు వెసులుబాటు బాగా పెరిగింది. ఈ తరంలో ఉన్నన్ని సౌకర్యాలు ఉండి ఉంటే సచిన్ టెండూల్కర్ తాను చేసిన పరుగుల కంటే రెట్టింపు పరుగులు, రెట్టింపు సెంచరీలు చేసి ఉండేవాడు..’ అంటూ ట్వీట్ చేశాడు శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య...

సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 39 సార్లు అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు అవుట్ అయ్యాడు. అంపైర్ నిర్ణయాన్ని రివ్యూ చేసేందుకు డీఆర్‌ఎస్ అందుబాటులో లేకపోవడంతో సచిన్ నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది.. 

ఇలా అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు అవుటైన ఎక్కువ సందర్భాల్లో సచిన్ టెండూల్కర్ 80+, 90+ పరుగులు చేశాడు. డీఆర్‌ఎస్ ఉండి ఉంటే, అవన్నీ సెంచరీలుగా మారి ఉండేవి. అలా చూస్తే సచిన్ టెండూల్కర్ ఈజీగా తన కెరీర్‌లో 75+ వన్డే సెంచరీలు చేసి ఉండేవాడు.. 

Latest Videos

click me!