హిట్ మ్యాన్ లేకుంటే పంత్, రాహుల్ లు కాదు.. అతడే బెస్ట్ : జాఫర్

Published : Jun 16, 2022, 04:41 PM IST

టీమిండియాకు  ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో రోహిత్ శర్మ సారథిగా వ్యవహరిస్తున్నాడు. అయితే అతడు అందుబాటులో లేకుంటే ఆ అవకాశం  కెఎల్ రాహుల్, రిషభ్ పంత్ కు దక్కుతున్నది. 

PREV
17
హిట్ మ్యాన్ లేకుంటే పంత్, రాహుల్ లు కాదు.. అతడే బెస్ట్ : జాఫర్

భారత జట్టుకు విరాట్ కోహ్లి తర్వాత సారథిగా నియమితుడైన రోహిత్ శర్మ గైర్హాజరీలో సెలక్టర్ల చూపు భావి కెప్టెన్  గా భావిస్తున్న కెఎల్ రాహుల్, రిషభ్ పంత్  వైపే పడుతున్నది. ఈ ఏడాది మొదట్లో దక్షిణాఫ్రికా సిరీస్ కు కెఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉండగా.. ప్రస్తుతం స్వదేశంలో సఫారీ సిరీస్ కు రిషభ్ పంత్ నాయకుడిగా ఉన్నాడు. 

27

అయితే రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో ఈ ఇద్దరూ కాకుండా మరో కొత్త పేరును సూచించాడు టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్. హిట్ మ్యాన్ లేకుంటే టీమిండియాను నడిపే బాధ్యతను హార్ధిక్ పాండ్యాకు అప్పగించాలని అన్నాడు.

37

జాఫర్ మాట్లాడుతూ.. ‘ఆ బాధ్యత (టీమిండియా కెప్టెన్) కు అతడు అర్హుడు. జట్టును విజయపథంలో నడిపించే సత్తా  హార్ధిక్ కు ఉంది.  టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకుంటే పాండ్యాకు సారథ్య పగ్గాలు అప్పజెప్పాలి. 

47

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో  హార్ధిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ ను అద్భుతంగా నడిపించాడు. జట్టుగానే గాక అతడి వ్యక్తిగత ప్రదర్శన కూడా బాగా మెరుగైంది. 

57

బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా పాండ్యా మెరుగ్గా రాణిస్తున్నాడు. రోహిత్ కెప్టెన్ గా ఉంటే హార్ధిక్ ను వైస్ కెప్టెన్ గా చేయాలి. ఆ క్రమంలో రోహిత్ లేనప్పుడు హార్ధిక్ కు నేరుగా  కెప్టెన్ అయ్యే అవకాశం దక్కుతుంది..’ అని జాఫర్ తెలిపాడు.

67

కాగా.. దక్షిణాఫ్రికా సిరీస్ అనంతరం భారత జట్టు ఐర్లాండ్ తో రెండు టీ20 మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ లో టీమిండియాకు హార్ధిక్ పాండ్యా సారథిగా ఉండనున్నాడు. జాతీయ జట్టుకు కెప్టెన్ గా అతడికి ఇదే తొలి పరీక్ష. 

77

కొద్దిరోజుల క్రితమే హార్ధిక్ పాండ్యా.. జాఫర్ గురించి  మాట్లాడుతూ.. ‘నాకు కూడా జాక్వస్ కలిస్, సచిన్, విరాట్ ల ఆటంటే చాలా ఇష్టం.  వీళ్లే గాక చాలా మంది దిగ్గజాల ఆటను నేను ఇష్టపడతాను. కానీ నా ఫేవరేట్ క్రికెటర్ మాత్రం  వసీం జాఫర్.జాఫర్ బ్యాటింగ్ చేస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. అతడు లెజెండరీ క్రికెటర్.  పలు సందర్భాల్లో నేను కూడా జాఫర్ బ్యాటింగ్ స్టైల్ ను కాపీ కొడదామనుకున్నా. కానీ నేను అతడి క్లాస్ ను అందుకోలేకపోయా...’ అని తెలిపిన విషయం విదితమే. 

Read more Photos on
click me!

Recommended Stories