ఆర్‌సీబీ జట్టుతో రోహిత్ శర్మ టైటిల్ గెలవగలడా? గంభీర్‌కి కౌంటర్ ఇచ్చిన ఆకాశ్ చోప్రా...

Published : Nov 14, 2020, 01:51 PM IST

IPL 2020 సీజన్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌లో చీలికలు తీసుకొచ్చింది. ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్ శర్మకి భారత టీ20 కెప్టెన్సీ ఇవ్వాలని కొందరు అభిమానులు తీవ్రంగా వాదిస్తుంటే, రోహిత్ శర్మదేం లేదు, అతనికి బలమైన జట్టు దొరికింది అంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఈ చర్చ ఇప్పుడు గౌతమ్ గంభీర్, ఆకాశ్ చోప్రా మధ్య ఆసక్తికర ఫైట్‌కి దారి తీసింది.

PREV
110
ఆర్‌సీబీ జట్టుతో రోహిత్ శర్మ టైటిల్ గెలవగలడా? గంభీర్‌కి కౌంటర్ ఇచ్చిన ఆకాశ్ చోప్రా...

‘రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కి ఐదు టైటిల్స్ అందించాడు. అతనికి భారత జట్టు కెప్టెన్సీ ఇవ్వకపోతే, రోహిత్‌కి ఏం పోదు, కానీ టీమిండియా చాలా కోల్పోతుంది...’ ముంబై ఇండియన్స్ ఫైనల్ మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు..

210

‘8 ఏళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును నడిపిస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్ అందించలేకపోయాడు. 8 ఏళ్లంటే ఒక కెప్టెన్‌కి చాలా ఎక్కువ సమయం...’ సన్‌రైజర్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ ఓటమి అనంతరం గౌతీ కామెంట్...

310

‘ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్... పెద్దగా బ్యాటింగ్ చేసింది ఏమీ లేదు. వాళ్లు ఆడిన మ్యాచుల్లో చాలావరకూ చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరిగాయి... అందుకే ఎక్కువ పరుగులు చేయగలిగారు...’ మరో సందర్భంగా ఆర్‌సీబీని, కోహ్లీని ట్రోల్ చేసిన గౌతమ్ గంభీర్.
 
410

భారత సారథి విరాట్ కోహ్లీపైకి విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు భారత మాజీ ఓపెనర్, కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్... దీంతో భారత మాజీ క్రికెటర్, క్రికెట్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా, గౌతీకి ఓ సూపర్ కౌంటర్ వేశాడు

510

‘రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్సీ ఇవ్వకపోతే దేశం చాలా నష్టపోతుందని గౌతమ్ గంభీర్ అన్నాడు. బాగుంది, కానీ నాకో అనుమానం. ఇప్పుడున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో రోహిత్ శర్మ టైటిల్ గెలవగలడా?... చేయగలడని ధీమాగా చెప్పండి, భారత జట్టుకి కెప్టెన్‌ని చేసేద్దాం’ అంటూ కామెంట్ చేశాడు ఆకాశ్ చోప్రా.

610

ముంబై ఇండియన్స్ జట్టు వేరు, భారత జట్టు వేరు. ముంబై సక్సెస్ స్టోరీని టీమిండియాతో పోల్చడం సరికాదు. రోహిత్ నిజంగా మంచి కెప్టెన్. కానీ అతని దగ్గర మంచి టీమ్ ఉంది...

710

సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, డి కాక్, పోలార్డ్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రోహిత్ శర్మ, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్... అందరూ సమిష్టిగా రాణించి ముంబైకి టైటిల్ అందించారు...

810

కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి వేరు, ఏబీ డివిల్లియర్స్, కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, యజ్వేంద్ర చాహాల్ తప్ప ఆ జట్టులో మరో ప్లేయర్ రాణించనేలేదు...

910

అలాంటి జట్టుతో ప్లేఆఫ్ చేరడమంటే విరాట్ కోహ్లీ సక్సెస్ అయినట్టే, అతని టీమ్ ఫెయిల్ అయ్యింది. అది అతని తప్పు కాదు... అంట చెప్పుకొచ్చాడు ఆకాశ్ చోప్రా...

1010

భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే విధంగా స్పందించిన విషయం తెలిసిందే. ‘రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్ కాదని, కేవలం బెస్ట్ టీమ్‌కి కెప్టెన్ మాత్రమే’ అని చెప్పాడు వీరూ.

click me!

Recommended Stories