సెంచరీ చేయలేకపోతే, నీ ప్లేస్ గోవిందే! రోహిత్ వస్తే... శుబ్‌మన్ గిల్‌పై మహ్మద్ కైఫ్ కామెంట్...

First Published Dec 16, 2022, 11:42 AM IST

ఆడిలైడ్ టెస్టులో పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 4 పరుగులే చేయడంతో అతన్ని తప్పించి, మెల్‌బోర్న్ టెస్టులో శుబ్‌మన్ గిల్‌కి అవకాశం ఇచ్చింది టీమిండియా... ఆ పర్యటనలో మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న శుబ్‌మన్ గిల్, బ్రిస్బేన్ టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేసి అదరగొట్టాడు... అయితే ఇప్పటిదాకా టెస్టుల్లో సెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు.

ఆస్ట్రేలియా టూర్ తర్వాత స్వదేశంలో జరిగిన సిరీసుల్లో ఫెయిల్ అయినా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021 ఫైనల్ ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు... అయితే ఆ మ్యాచ్ తర్వాత శుబ్‌మన్ గిల్ గాయంతో బాధపడుతున్నాడని తేలడంతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అతని ప్లేస్‌లో కెఎల్ రాహుల్‌కి అవకాశం కల్పించింది టీమిండియా...

దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్, నాలుగంటే నాలుగు మ్యాచులు ముగిసే సరికి టెస్టుల్లో వైస్ కెప్టెన్ అయిపోయాడు. రోహిత్ శర్మ గాయపడడంతో బంగ్లాదేశ్ టూర్‌లో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు..

కెఎల్ రాహుల్ టెస్టు రీఎంట్రీతో శుబ్‌మన్ గిల్‌కి గేట్లు మూసుకుపోయాయి. అయితే రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ తరుచూ గాయపడుతూ ఉండడంతో టీమ్‌లోకి వచ్చి పోతూ ఉన్నాడు శుబ్‌మన్ గిల్...

రోహిత్, రాహుల్ ఇద్దరూ గాయపడడంతో ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో పూజారాతో ఓపెనింగ్ చేసిన శుబ్‌మన్ గిల్, బంగ్లాతో తొలి టెస్టు మ్యాచ్‌లో కెఎల్ రాహుల్‌తో ఓపెనింగ్ చేస్తున్నాడు...

అయితే 11 టెస్టుల్లో 22 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ అందుకోలేకపోయాడు శుబ్‌మన్ గిల్. ‘రోహిత్ శర్మ లేకపోవడంతో శుబ్‌మన్ గిల్‌కి ఛాన్స్ దొరికింది. అయితే రోహిత్ శర్మ రీఎంట్రీ ఇస్తే గిల్‌ మళ్లీ రిజర్వు బెంచ్‌కి వెళ్లాల్సిందే. గిల్ ఇప్పటిదాకా 22 ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్ చేశాడు. 

బ్రిస్బేన్ టెస్టులో 91 పరుగులు చేసి మెప్పించాడు, అయితే సెంచరీ మాత్రం చేయలేకపోయాడు. ఓపెనర్‌గా క్రీజులో సెటిల్ అయ్యాక భారీ స్కోరు చేయాల్సిన బాధ్యత నీపైన ఉంటుంది. 20-30 చేశాక అవుటైతే అది నీ టెక్నిక్‌లో లోపం ఉన్నట్టే. విరాట్ కోహ్లీ 1 పరుగుకే అవుట్ అయ్యాడు. అతను అప్పుడే వచ్చాడు, బాల్‌ని అంచనా వేయలేకపోయాడు.

అయితే శుబ్‌మన్ గిల్ అలా కాదు, 40 బంతులు ఆడి 20 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. గిల్ మంచి ప్లేయర్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి రికార్డులు కూడా క్రియేట్ చేశాడు. 50 సగటుతో 3 వేలకు పైగా పరుగులు చేశాడు.

వన్డేల్లో సెంచరీ చేసి వస్తున్నాడు. కాబట్టి టెస్టుల్లో కూడా అలాంటి ఫీట్ రిపీట్ చేస్తే... అతని చోటుకి భద్రత ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. 

click me!