ఈ పిచ్‌ను చూస్తే డికాక్ ‘నేను ఐపీఎల్ ఆడను బాబోయ్’అని పారిపోతాడు : లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ విమర్శలు

First Published Jan 30, 2023, 4:10 PM IST

లక్నోలో భారత్ గెలిచినా లక్నో పిచ్ పై మాత్రం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ  మ్యాచ్ ముగిశాక పిచ్ పొలాల్లో బీటలు వారితే అందులో బంతి పడి మెలికలు తిరిగినట్టుగా తిరుగుతుందని కొందరు అంటే.. అది పిచ్ కాదని,  గతుకుల రోడ్డు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

భారత్ - న్యూజిలాండ్ మధ్య లక్నో వేదికగా  ఆదివారం ముగిసిన రెండో టీ20లో  టీమిండియా ఆపసోపాలు పడి గెలిచింది. అసలు బ్యాటర్లకు ఏమాత్రం అనుకూలించన ఈ పిచ్ పై స్పిన్నర్లు పండుగ చేసుకున్నారు.  భీకరమైన హిట్టర్లు ఉన్న ఇరు జట్లలో ఒక్కరు కూడా సిక్సర్ కొట్టకపోగా.. మ్యాచ్ మొత్తమ్మీద 14 ఫోర్లు నమోదయ్యాయి.  గతంలో మనమెప్పుడూ చూడని విధంగా కివీస్.. గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్ లతో కూడా బౌలింగ్ చేయించి ఫలితాలు రాబట్టింది. 

మ్యాచ్ లో భారత్ గెలిచినా లక్నో పిచ్ పై మాత్రం తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.  ఈ  మ్యాచ్ ముగిశాక పిచ్ పొలాల్లో బీటలు వారితే అందులో బంతి పడి మెలికలు తిరిగినట్టుగా తిరుగుతుందని కొందరు అంటే.. అది పిచ్ కాదని,  గతుకుల రోడ్డు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పిచ్ పై టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుతం ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు మెంటార్ గా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్  తనదైన స్టైల్ లో విమర్శలు గుప్పించాడు. 

ఈ పిచ్ ను గనక చూస్తే దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (ఐపీఎల్ లో లక్నో తరఫున కూడా ఇతడే వికెట్ కీపర్, ఓపెనింగ్ బ్యాటర్ గా ఉన్నాడు)తాను మళ్లీ ఐపీఎల్ ఆడనని భయపడి పారిపోతాడని విమర్శించాడు.  బ్యాటర్లకు ఏమాత్రం సహకరించని ఈ పిచ్ ను ఎందుకు తయారుచేశారని వాపోయాడు. 

మ్యాచ్ జరుగుతుండగా స్టార్ స్పోర్ట్స్ లో హిందీ కామెంట్రీ చెప్పిన గంభీర్ మాట్లాడుతూ... ‘ఐపీఎల్ 2023లో మళ్లీ పాత స్టైల్  (హోం అండ్ అవే)  లో మ్యాచ్ లను నిర్వహించాలని చూస్తున్నారు. అలా అయితే లక్నో సూపర్ జెయింట్స్ ఇక్కడ మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. అదే జరిగితే ఈ పిచ్ ను గనక చూస్తే సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ అతడు ఐపీఎల్ ఆడటానికి రాడు..’అని చెప్పాడు. 

అప్పుడు పక్కనేఉన్న మరో కామెంటేటర్ మహ్మద్ కైఫ్ వెంటనే మైక్ అందుకుని.. ‘లేదు లేదు డికాక్ వస్తాడు. వస్తాడు..’అని నవ్వుతూ  చెప్పాడు. ఆ తర్వాత గంభీర్ మళ్లీ మాట్లాడుతూ.. ‘ఈ పిచ్ పై అమిత్ మిశ్రా  బాగా రాణిస్తాడు.  ఈ సీజన్ లో ఇలాంటి పిచ్ నే తయారుచేస్తే మాత్రం అమిత్ మిశ్రాకు పండుగే..’అని వ్యాఖ్యానించాడు. 

దానికి కైఫ్.. ‘లక్నో స్ట్రాటజీని నేను అర్థం చేసుకోగలను.  వాళ్లు యువ స్పిన్నర్  రవి బిష్ణోయ్ ను రంగంలోకి దించవచ్చు. ఇద్దరినీ కలిపి ఆడిస్తే ప్రత్యర్థులకు చుక్కలే...’అచి చెప్పాడు. కాగా గతేడాది ఐపీఎల్ వేలంలో  అమిత్ మిశ్రాను  ఫ్రాంచైజీలు కొనుగోలు చేయలేదు. కానీ డిసెంబర్ లో ముగిసిన ఐపీఎల్ మినీవేలంలో లక్నో జట్టు.. మిశ్రాను దక్కించుకుంది. 

click me!