ఫుట్‌బాల్‌కి మెస్సీ ఎలాగో, క్రికెట్‌కి విరాట్ కోహ్లీ అలాగే... ఫర్వేజ్ మహరూఫ్ కామెంట్..

First Published Jan 17, 2023, 11:27 AM IST

సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ... ఈ వరుసలో ఎందరో యువ క్రికెటర్లకు రోల్‌ మోడల్‌ విరాట్ కోహ్లీ. 14 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో తిరుగులేని రికార్డులెన్నో క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ... ప్రస్తుత తరంలో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు...
 

ప్రపంచంలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ ఫుట్‌బాల్. సాకర్ ప్రపంచంలో తిరుగులేని సూపర్ స్టార్, అర్జెంటీనా ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ.. . 2022 ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత లియోనెల్ మెస్సీ, చాలా విషయాల్లో క్రిస్టియానో రొనాల్డోని దాటేశాడు...

Image credit: PTI

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న విరాట్ కోహ్లీ, విన్నింగ్ పర్సేంటేజ్ పరంగా చూస్తే వన్డేల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. టీ20ల్లో రికార్డు విజయాలు అందుకున్న విరాట్ కోహ్లీ... గత ఏడాది ఆరంభంలో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు...

Image credit: PTI

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఐసీసీ టైటిల్ కానీ, ఐపీఎల్ టైటిల్ కానీ గెలవలేకపోయారు. అన్నీ ఉన్నా విరాట్‌కి కూసింత అదృష్టం లేదంటారు ఆయన అభిమానులు. అందుకే వరల్డ్ కప్ గెలవలేకపోయిన రొనాల్డోతో విరాట్ కోహ్లీని పోలుస్తూ ఉంటారు...

Virat Kohli

అయితే శ్రీలంక మాజీ క్రికెటర్ ఫర్వేజ్ మహరూఫ్ మాత్రం విరాట్ కోహ్లీని లియోనెల్ మెస్సీతో పోల్చేశాడు. ‘ఫుట్‌బాల్‌లో లియోనెల్ మెస్సీ ఆల్‌టైం గ్రేట్ అయితే నా దృష్టిలో క్రికెట్‌కి విరాట్ కోహ్లీ ఆల్‌టైం గ్రేట్. విరాట్‌కి ముందు, విరాట్ తర్వాత అతనిలా చాలామంది రికార్డులు క్రియేట్ చేయొచ్చు. అయితే కోహ్లీ ఆటతీరు, కెప్టెన్సీ, అగ్రెసివ్ యాటిట్యూడ్... ఓ క్రికెటర్‌గా విరాట్ వరల్డ్ క్లాస్. దాన్ని ఎవ్వరూ టచ్ చేయలేరు...’ అంటూ చెప్పుకొచ్చాడు ఫర్వేజ్ మహరూఫ్...

Messi

శ్రీలంక తరుపున 22 టెస్టులు, 109 వన్డేలు, 8 టీ20 మ్యాచులు ఆడిన ఫర్వేజ్ మహరూఫ్, ఓవరాల్‌గా 167 వికెట్లు, 5 హాఫ్ సెంచరీలతో 1600లకు పైగా పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున రెండు సీజన్లు ఆడిన ఫర్వూజ్ మహరూఫ్, 2016లో అంతర్జాతీ క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు.. 

click me!