ఒకవేళ కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ మళ్లీ గాయపడితే ఏం చేస్తారు! కపిల్ దేవ్ కామెంట్...

Published : Aug 25, 2023, 11:56 AM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, జస్ప్రిత్ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించి, టీమ్‌కి అందుబాటులోకి వచ్చారు. కెఎల్ రాహుల్ ఇంకా పూర్తిగా కోలుకోకపోయినా ఆసియా కప్ 2023 జట్టులో చోటు దక్కించుకున్నాడు...  

PREV
18
ఒకవేళ కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ మళ్లీ గాయపడితే ఏం చేస్తారు! కపిల్ దేవ్ కామెంట్...

కెఎల్ రాహుల్, ఆసియా కప్ 2023 టోర్నీలో మొదటి రెండు, మూడు మ్యాచుల్లో ఆడకపోయినా ఆ తర్వాత జట్టుకి అందుబాటులో ఉంటాడని టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు..  అతను ఆసియా కప్‌లో ఒక్క మ్యాచ్ ఆడకపోయినా వన్డే వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడే అవకాశం ఉంది..

28

‘వన్డే వరల్డ్ కప్ కోసం టీమ్‌ని తయారుచేసేందుకు ఆసియా కప్ టోర్నీ ఓ అద్భుతమైన వేదిక. ఈ టోర్నీలో కుర్రాళ్లు, సీనియర్లు తమ ఫామ్‌ని నిరూపించుకుని, టైటిల్ గెలిపించాలని నేను కోరుకుంటున్నా...
 

38
Shreyas Iyer-KL Rahul

అయితే నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి.  ఆసియా కప్ టోర్నీకి 17 మందిని సెలక్ట్ చేశారు, అందులో అందరికీ అవకాశం ఇవ్వకపోతే, వారిని ఎంపిక చేసి వేస్ట్ అవుతుంది. వరల్డ్ కప్‌కి బెస్ట్ టీమ్‌ని, అందులోనూ పూర్తి ఫిట్‌గా ఉన్న టీమ్‌ని సెలక్ట్ చేయాల్సి ఉంటుంది..

48
KL Rahul

ప్రతీ ప్లేయర్‌ని పూర్తిగా పరీక్షించాలి. వరల్డ్ కప్ ఆడించాలనుకునే ఏ ప్లేయర్‌ని కూడా రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు. అదీకాకుండా కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌ని వన్డే వరల్డ్ కప్‌లో ఆడించాలని అనుకుంటున్నారు. ఒకవేళ వాళ్లు ఆసియా కప్‌లో లేదా ఆ తర్వాత గాయపడితే... ఏం చేస్తారు?

58
Sanju Samson-Ishan Kishan-KL Rahul

అదీకాకుండా ఒకవేళ వరల్డ్ కప్‌లో గాయపడితే, అంతకంటే దరిద్రం ఇంకేం ఉంటుంది. జట్టులో ఉన్న ప్లేయర్లు గాయంతో బయటికి వెళ్లాల్సి రావడం, టీమ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇస్తున్న ప్లేయర్లను, వరల్డ్ కప్‌కి ముందే వీలనన్ని ఎక్కువ మ్యాచులు ఆడించాలి..

68


టీమిండియా దగ్గర సత్తా ఉన్న ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏ ప్లేయర్‌ అయినా పూర్తి ఫిట్‌గా లేడని అనుమానం వస్తే, అతన్ని వరల్డ్ కప్‌కి ఎంపిక చేయకండి.

78

 వరల్డ్ కప్ సమయానికి కోలుకుంటాడని, వరల్డ్ కప్ మధ్యలో కోలుకుంటాడని కథలు వినాలని అనుకోవడం లేదు. పూర్తి ఫిట్‌గా ఉంటేనే టీమ్‌కి సెలక్ట్ చేయండి..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్.. 
 

88
Shreyas Iyer

ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ 2023 టోర్నీ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 2న టీమిండియా, పాకిస్తాన్‌తో తలబడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 4న నేపాల్‌తో మ్యాచ్ ఉంటుంది. ఈ రెండూగెలిస్తే సూపర్ 4 రౌండ్‌కి వెళ్తుంది భారత జట్టు.. 

click me!

Recommended Stories