జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్ అయితే టీమిండియా దశ తిరిగినట్టే... భారత క్రికెటర్ మోహిత్ శర్మ...

Published : Jun 28, 2022, 03:21 PM ISTUpdated : Jun 28, 2022, 03:22 PM IST

ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ మ్యాచ్‌కి కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ టెస్టుకి వైస్ కెప్టెన్‌గా ఎంపికైన జస్ప్రిత్ బుమ్రాకే టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి...

PREV
17
జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్ అయితే టీమిండియా దశ తిరిగినట్టే... భారత క్రికెటర్ మోహిత్ శర్మ...

కపిల్‌దేవ్ తర్వాత భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన వారిలో ఒక్క ఫాస్ట్ బౌలర్ కూడా లేడు. మధ్యలో అనిల్ కుంబ్లే వంటి స్పిన్ బౌలర్ మినహాయిస్తే టీమిండియాకి కెప్టెన్సీ చేసిన వారంతా బ్యాటర్లే. దీంతో ఫాస్ట్ బౌలర్లు కెప్టెన్లు కాలేరనే రూల్‌ని బుమ్రా బ్రేక్ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు భారత ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ..

27

‘జస్ప్రిత్ బుమ్రా గురించి మీకు ఎంత తెలుసో నాకు తెలీదు, అయితే నాకు మాత్రం అతని గురించి బాగా తెలుసు. మేమిద్దరం కలిసి చాలా ఏళ్లు క్రికెట్ ఆడం... అతను చాలా కూల్ అండ్ కామ్ క్యారెక్టర్...
 

37
Jasprit Bumrah

ఫీల్డ్‌లో అతను అగ్రెసివ్‌గా బౌలింగ్ చేస్తాడు, అలాగే ఆఫ్ ఫీల్డ్ చాలా కూల్‌గా ఉంటాడు. బుమ్రా కెప్టెన్ అయితే ఫాస్ట్ బౌలర్లు కూడా టీమ్‌ని నడిపించగలరు... అని నిరూపించినట్టు అవుతుంది...

47

ఐపీఎల్‌లో హార్ధిక్ పాండ్యా అదరగొట్టి, టీమిండియాకి కెప్టెన్‌గా మారాడు. ఆల్‌రౌండర్లు టీమ్‌ని నడిపించగలరని నిరూపించాడు. ఇంతకుముందు పాజీ కపిల్ దేవ్ కూడా ఈ పనిని చేసి చూపించారు...

57
Jasprit Bumrah

అయితే ఫాస్ట్ బౌలర్లలో టీమ్‌ని నడిపించే సత్తా ఉంటుంది. ఆస్ట్రేలియా టీమ్‌ని ప్యాట్ కమ్మిన్స్‌ అద్భుతంగా నడిపిస్తున్నాడు. కాబట్టి బుమ్రా కెప్టెన్ అయితే టీమిండియా దశ కూడా తిరుగుతుంది...

67
Jasprit Bumrah

ఫాస్ట్ బౌలర్లకు పిచ్ గురించి, వాతావరణం గురించి పూర్తి అవగాహన ఉంటుంది. బాల్ ఎలా స్పందిస్తుందో చాలా వేగంగా అర్థం చేసుకోగలరు. గెలుపు కోసం నూటికి 200 శాతం ఎఫర్ట్స్ పెడతారు... కాబట్టి బుమ్రాని కెప్టెన్‌గా చేస్తే సంతోషించేవారిలో నేనూ ఉంటా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ మోహిత్ శర్మ...

77

2013లో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన మోహిత్ శర్మ, భారత జట్టు తరుపున 26 వన్డేలు, 4 టీ20 మ్యాచులు ఆడి 37 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడిన మోహిత్ శర్మ, 2020 తర్వాత ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించలేకపోయాడు. 

Read more Photos on
click me!

Recommended Stories