కోహ్లీ నాతో 20 నిమిషాలు మాట్లాడితే చాలు.. అప్పుడతడిని ఎవరూ ఆపలేరు : సునీల్ గవాస్కర్

Published : Jul 19, 2022, 12:28 PM IST

Virat Kohli:వరుస వైఫల్యాలు వెన్నాడుతున్న వేళ టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి  సలహాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది సీనియర్ క్రికెటర్లు కోహ్లీకి ‘విలువైన’ సలహాలిస్తున్నారు. 

PREV
17
కోహ్లీ నాతో 20 నిమిషాలు మాట్లాడితే చాలు.. అప్పుడతడిని ఎవరూ ఆపలేరు : సునీల్ గవాస్కర్

పేలవ ఫామ్ తో కొట్టుమిట్టాడుతున్న విరాట్ కోహ్లీకి బ్యాడ్ టైమ్ నడుస్తున్నది. కోహ్లీ మీద కూర్చున్న ఆ ‘శని’ ఎప్పుడు వదులుతుందోనని అతడి అభిమానులతో పాటు యావత్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. 

27

ఈ క్రమంలో భారత దిగ్గజ క్రికెటర్  సునీల్ గవాస్కర్.. కోహ్లీకి కీలక సలహాలిచ్చాడు. కోహ్లీ తనతో 20 నిమిషాలు మాట్లాడితే అతడు మళ్లీ మునపటి ఫామ్ ను  అందుకునేలా నేను సలహాలిస్తానని గవాస్కర్ చెప్పాడు. 
 

37
Image credit: Getty

ఇండియా టుడేతో గవాస్కర్ మాట్లాడుతూ.. ‘కోహ్లీ నాతో ఒక 20 నిమిషాలు మాట్లాడితే అది అతడికి చాలా హెల్ప్ అవుతుంది. నేను చెప్పే సలహాల వల్ల కోహ్లీ ఇప్పటికిప్పుడు ఫామ్ ను అందుకుంటాడని నేను చెప్పడం లేదు. కానీ అవి అతడికి ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నా.
 

47
Image credit: Getty

ముఖ్యంగా కోహ్లీ ఈ  మధ్య తరుచూ ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ కు ఆవలగా వెళ్తున్న బంతులను వెంటాడి ఔటవుతున్నాడు. ఒక ఓపెనింగ్ బ్యాటర్ గా అలాంటి బంతులను ఆడటంలో ఇబ్బందులు పడినవాడిగా చెప్తున్నా.. 
 

57

ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను వదిలేయడంలో కొంత ప్రయత్నాలు చేస్తాం.  ఒక 20 నిమిషాలు నాతో మాట్లాడితే నేను అతడికి అవన్నీ చెబుతా. కోహ్లీ చేసే తొలి తప్పే అతడి విషయంలో చివరిది అవుతుంది’ అని గవాస్కర్ తెలిపాడు. భారీ ఇన్నింగ్స్ లు లేకపోవడంతో ప్రతి బంతిని ఆడేందుకే బ్యాటర్ ప్రవర్తిస్తాడని, సాధారణంగా వదిలేసే బంతులను కూడా ఆడబోయి అవుటవుతామని వివరించాడు. 

67
Sunil Gavaskar

ప్రపంచంలో ఎంతటి దిగ్గజ ఆటగాడికైనా కెరీర్ లో ఎత్తుపల్లాలు సహజమని.. కోహ్లీ తిరిగి ఫామ్ ను అందుకునేదాకా వేచిచూడాలని గవాస్కర్ తెలిపాడు.  భారత్ తరఫున అతడు 70 అంతర్జాతీయ  సెంచరీలు చేసిన విషయం మరువరాదని  సన్నీ అన్నాడు.  ఒక్కసారి కోహ్లీ మునపటి ఫామ్ ను అందుకుంటే  మళ్లీ అతడిని ఆపడం ఎవరి  తరమూ కాదన్నాడు.

77
Sunil Gavaskar

‘కోహ్లీ  విషయంలో కొంచెం ఓపికగా ఉండండి.  ఒక ప్లేయర్ 30 లలోకి చేరుకోగానే సెంచరీ చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. ముందు అతడి (కోహ్లీ)ని తన ఆట ఆడనివ్వండి. భారత క్రికెట్ లో దిగ్గజాలుగా వెలుగొందినవారంతా ఈ దశను  దాటివచ్చినోళ్లే..’ అని సన్నీ ముగించాడు. 
 

Read more Photos on
click me!

Recommended Stories