ఫిట్‌గా లేకపోతే ఎందుకు సెలక్ట్ చేశారు? మరో ప్లేయరే దొరకలేదా.. కెఎల్ రాహుల్ ఎంపికపై క్రిష్ శ్రీకాంత్ కామెంట్..

Published : Aug 23, 2023, 03:57 PM IST

టీమిండియాలో అత్యధిక ట్రోల్ మెటీరియల్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేరు కెఎల్ రాహుల్. ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ కోసం బాగా ఆడతాడని, టీమిండియా ఆడాల్సి వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తాడని కొన్నేళ్లుగా విమర్శలు ఫేస్ చేస్తున్నాడు లోకేశ్ రాహుల్. 

PREV
110
ఫిట్‌గా లేకపోతే ఎందుకు సెలక్ట్ చేశారు? మరో ప్లేయరే దొరకలేదా.. కెఎల్ రాహుల్ ఎంపికపై క్రిష్ శ్రీకాంత్ కామెంట్..

గత ఏడాది టీమిండియాకి వన్డే, టీ20, వన్డేల్లో కెప్టెన్సీ కూడా చేసిన కెఎల్ రాహుల్, ఐపీఎల్ 2023 సీజన్‌లో గాయపడి 3 నెలల తర్వాత తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐపీఎల్‌కి ముందు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాహుల్‌ని ఆడించడంపై టీమిండియా మేనేజ్‌మెంట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ వీరలెవెల్లో విరుచుకుపడ్డాడు..
 

210
KL Rahul

కెఎల్ రాహుల్‌ని సపోర్ట్ చేయబోయిన ఆకాశ్ చోప్రా కూడా వెంకటేశ్ ప్రసాద్ మరీ బహిరంగంగా కుండబద్ధలు కొట్టినట్టు పచ్చి నిజాలు మాట్లాడుతుండడంతో నిమ్మకుండిపోయాడు. తాజాగా భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా కెఎల్ రాహుల్ ఎంపికపై సెలక్టర్లను తప్పుబట్టాడు..

310

‘కెఎల్ రాహుల్ పూర్తిగా కోలుకోలేదనే సెలక్టర్లే చెబుతున్నారు. అతను మొదటి రెండు మూడు మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదు. అలాంటప్పుడు అతన్ని సెలక్ట్ చేయడం దేనికి? 

410

సెలక్షన్ సమయానికి ఏ ప్లేయర్ ఫిట్‌గా లేకపోయినా అతన్ని సెలక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సెలక్షన్ పాలసీ అలాగే ఉంటుంది. కోలుకోకముందే, ఫలానా సమయానికి కోలుకుంటాడు, ఫలానా మ్యాచులు ఆడతాడని చెప్పడం కరెక్ట్ కాదు..

510


ఒకవేళ వరల్డ్ కప్‌లో కెఎల్ రాహుల్‌ని ఆడించాలనుకుంటే అప్పటివరకూ అతను ఫిట్‌నెస్ సాధించేలా చూడండి. దానికి ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కావాలంటే ఆస్ట్రేలియాతో సిరీస్ కూడా ఉంది..
 

610

ఫిట్‌గా లేని కెఎల్ రాహుల్‌ని సెలక్ట్ చేసి ఆసియా కప్ ఆడించాల్సిన అవసరం ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. అతని ప్లేస్‌లో ఆడడానికి టీమిండియా దగ్గర ప్లేయర్లు లేరా? సంజూ శాంసన్‌ని ట్రావెలింగ్ రిజర్వ్‌లా ఎంపిక చేయడం దేనికి? అతన్ని టీమ్‌లో చోటు కల్పించొచ్చుగా.

710
Rohit Sharma

ఆసియా కప్ టోర్నీ కూడా టీమిండియాకి ముఖ్యమే. గత ఆసియా కప్ టోర్నీలో మనం ఫైనల్ కూడా ఆడలేకపోయాం. ఈసారి ఫైనల్ వెళ్లాలి, టైటిల్ గెలవాలి. సెలక్టర్లకు ఇంకా వరల్డ్ కప్ టీమ్ గురించి క్లారిటీ లేనట్టుగా తెలుస్తోంది..

810
VVS Laxman

ఎవరిని సెలక్ట్ చేయాలి? ఎవరిని ఆడించాలనే క్లారిటీ లేనప్పుడే ఇలాంటి పనులు చేస్తారు. నేను సెలక్షన్ కమిటీలో ఉన్నప్పుడు ఎలా ప్లేయర్లను ఎంపిక చేసేవాళ్లంటే పూర్తిగా ఫిట్‌గా ఉండి, మ్యాచ్‌కి సిద్ధంగా ఉన్నప్పుడే... సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌కి ముందు వీవీఎస్ లక్ష్మణ్ వచ్చి, మ్యాచ్ సమయానికి ఫిట్‌గా అవుతా, టీమ్‌లో ఉంచమని చెప్పాడు..

910

అయితే మ్యాచ్ సమయానికి అతను ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు. ముందుగానే అతనికి రిప్లేస్‌గా రోహిత్ శర్మను సెలక్ట్ చేశాం. అతనేమో నేను ఎలాగో మ్యాచ్ ఆడను కదా అని ఫిట్‌బాల్ ఆడి, గాయపడ్డాడు. ఇక ఏం చేయాలో తెలియక వృద్ధిమాన్ సాహాను ఆడించాం. అలా అతను టెస్టు ఆరంగ్రేటం చేశాడు..
 

1010

ఆ రోజు నుంచే ఏ ప్లేయర్‌ అయినా సరే, టీమ్‌ని ప్రకటించే సమయానికి ఫిట్‌గా లేకపోతే అతన్ని ఎంపిక చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు మీరు చేస్తున్న పనులు చూస్తుంటే... భారత జట్టు దగ్గర సత్తా ఉన్న ప్లేయర్లు లేనట్టుగా ఉంది.. మీరు అలాంటి పరిస్థితి క్రియేట్ చేశారు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్..

click me!

Recommended Stories