టీమ్ సెలక్షన్‌లో ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?... అతను ఉండగా ఉమేశ్ ఎందుకు! ఆశీష్ నెహ్రా కామెంట్...

First Published Sep 22, 2022, 3:51 PM IST

ఆటలో ప్రయోగాలు అవసరం కానీ ప్రయోగాలతోనే ఆటాడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం భారత జట్టు పరిస్థితి ఇదే. కెప్టెన్లు, ఓపెనర్లు, బౌలర్లు, బ్యాటింగ్ పొజిషన్... ఇలా ప్రతీ దాంట్లోనూ అనవసర ప్రయోగాలు చేస్తోంది టీమిండియా. ఆసియా కప్ 2022లోనూ ప్రయోగాలు చేసిన భారత జట్టు, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లోనూ వాటిని కొనసాగిస్తున్నారు...

Image credit: Getty

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో దీపక్ చాహార్, జస్ప్రిత్ బుమ్రాలకు తుది జట్టులో చోటు కల్పించలేదు టీమ్ మేనేజ్‌మెంట్. జస్ప్రిత్ బుమ్రా ఇంకా పూర్తిగా గాయం నుంచి కోలుకోలేదని వార్తలు వినిపించగా మహ్మద్ షమీ స్థానంలో వచ్చిన ఉమేశ్ యాదవ్‌కి టీమ్‌లో చోటు దక్కింది...

ఐపీఎల్ 2022 సీజన్‌లో కేకేఆర్‌కి ఇచ్చిన పర్ఫామెన్స్‌తో పాటు రాయల్ లండన్ వన్డే కప్‌లో ఉమేశ్ యాదవ్ చేసిన ప్రదర్శన కారణంగా అతనికి దాదాపు మూడేళ్ల తర్వాత టీ20ల్లో చోటు దక్కింది. అయితే బుమ్రా అందుబాటులో లేనప్పుడు దీపక్ చాహార్‌ని ఆడించకపోవడం వివాదాస్పదమైంది..

‘ఉమేశ్ యాదవ్‌ని ఎందుకు ఆడించారు? ఆస్ట్రేలియా సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో అతను లేడు. మహ్మద్ షమీకి కరోనా పాజిటివ్ రావడంతో ఉమేశ్‌కి అవకాశం దక్కింది. అలాంటప్పుడు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన దీపక్ చాహార్‌కి తొలి అవకాశం దక్కాలి కదా...

Image credit: Getty

దీపక్ చాహార్ ఫిట్‌గా ఉండి కూడా ఆడకపోతే మాత్రం టీమ్ సెలక్షన్‌లో మేనేజ్‌మెంట్‌లో కన్ఫ్యూజన్ ఉన్నట్టే. భువనేశ్వర్ కుమార్ ప్లేస్‌ని రిప్లేస్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్ దీపక్ చాహార్...

Deepak Chahar

టీమ్ సెలక్షన్‌ విషయంలో ఇంత గందరగోళం పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అనవసర ప్రయోగాలతో కొత్తగా కనిపెట్టేదీ ఏమీ ఉండదు. బెస్ట్ ప్లేయర్లు అందుబాటులో ఉన్నప్పుడు వారి నుంచి మనకి కావాల్సిన రిజల్ట్ రాబట్టాలి. అంతేకానీ ప్రయోగాలు చేస్తూ వారి పర్ఫామెన్స్‌ని దెబ్బ తీయొద్దు...

బుమ్రాకి వర్క్ లోడ్ తగ్గించడం అవసరమే. అతను ఆసియా కప్ 2022 టోర్నీ ఆడలేదు. అంతకుముందు వెస్టిండీస్, జింబాబ్వే టూర్లలో అతనికి రెస్ట్ ఇచ్చారు. ఇంగ్లాండ్ టూర్‌లోనూ మొదటి వన్డే తర్వాత అతన్ని తప్పించారు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా...

click me!