భువీలో పదును తగ్గిందా? లేక రోహిత్ శర్మ సరిగ్గా వాడుకోలేకపోతున్నాడా...

First Published Sep 22, 2022, 3:13 PM IST

జస్ప్రిత్ బుమ్రా కంటే ముందు నుంచే టీమిండియాకి ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు భువనేశ్వర్ కుమార్. మొదటి ఓవర్‌లోనే వికెట్ తీయడం, డెత్ ఓవర్‌లో యార్కర్లు, స్వింగర్లతో బ్యాటర్లకు చుక్కలు చూపించడం భువీ స్పెషాలిటీ. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ నుంచి భువీలో ఆ మునుపటి బౌలింగ్ కనిపించడం లేదు...

Bhuvneshwar Kumar

ఐపీఎల్ 2021 సీజన్ ఫెయిల్ అయిన తర్వాత కూడా భువనేశ్వర్ కుమార్‌ని టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక చేశారు సెలక్టర్లు. టీమిండియాకి భువీకి ఇంతకుముందు అందించిన విజయాలే, అతన్ని సెలక్ట్ చేయడానికి ప్రధాన కారణం. అయితే పొట్టి ప్రపంచకప్‌లో భువీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు...

Image credit: PTI

ఆ తర్వాత గాయంతో కొన్నాళ్లు జట్టుకి దూరమైన భువనేశ్వర్ కుమార్, టీమిండియాకి టీ20, వన్డేల్లో ప్రధాన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. టెస్టుల్లో కూడా కొనసాగుతున్న జస్ప్రిత్ బుమ్రాకి రెస్ట్ ఇచ్చిన మ్యాచుల్లోనూ భువీని ఆడిస్తూ వచ్చింది బీసీసీఐ...

Image credit: PTI

ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్ కెప్టెన్సీలో జరిగిన ద్వైపాక్షిక సిరీసుల్లో తన మార్కు బౌలింగ్ చూపించిన భువనేశ్వర్ కుమార్‌, రోహిత్ శర్మ కెప్టెన్సీలో మాత్రం ఇంతకుముందులా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు...
 

Image credit: PTI

ఆసియా కప్ 2022లో పాకిస్తాన్, శ్రీలంక జట్లతో జరిగిన రెండు మ్యాచుల్లోనూ భారత జట్టు ఓటమికి భువీ వేసిన 19వ ఓవర్లు కూడా ఓ కారణం. కట్టుదిట్టమైన బౌలింగ్‌లో 4, లేదా 5... మహా అయితే 8 పరుగులు మాత్రమే ఇచ్చే భువనేశ్వర్ కుమార్... ఈ రెండు మ్యాచుల్లో కలిపి 19వ ఓవర్లలోనే 33 పరుగులు సమర్పించుకున్నాడు...

Bhuvneshwar Kumar

ఐపీఎల్ 2022 సీజన్‌లో కూడా భువనేశ్వర్ కుమార్ చక్కని పర్ఫామెన్స్ ఇచ్చాడు. 14 మ్యాచుల్లో 12 వికెట్లు మాత్రమే తీసినా 7.34 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. దీంతో అసలు తప్పు భువీలో ఉందా? లేక అతన్ని సరిగ్గా వాడుకోలేని రోహిత్‌లో ఉందా? అనేది పెద్ద హాట్ టాపిక్‌గా మారింది...

ఆసియా కప్ 2022లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడిన పాకిస్తాన్, శ్రీలంకలపై ఫెయిల్ అయిన భువనేశ్వర్ కుమార్, కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆడిన ఆఫ్ఘాన్ మ్యాచ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. రోహిత్ లేనప్పుడు వచ్చిన ఈ పర్ఫామెన్స్ కూడా అభిమానుల్లో ఈ తరహా అనుమానాలు రేగడానికి కారణమైంది..


దీనిపై సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌కి ఆడే జస్ప్రిత్ బుమ్రా అంటే రోహిత్ శర్మకు చాలా నమ్మకం. ఆ నమ్మకం భువీపై లేదని, అందుకే అతనిపై విశ్వాసం చూపించడం లేదని, ఇదే వరల్డ్ క్లాస్ బౌలర్ పూర్ పర్ఫామెన్స్‌కి కారణమని అంటున్నారు కొందరు...

మరికొందరు గాయాలతో సావాసం చేస్తూ 10 ఏళ్లుగా ఆడుతున్న భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో పదును తగ్గడంలో ఆశ్చర్యం ఏమీ లేదని, దానికి రోహిత్ శర్మ ఏమీ చేయలేడని వాదిస్తున్నారు. భువీ ఫెయిల్యూర్‌కి కారణం ఏదైనా అతని పూర్ పర్ఫామెన్స్ టీమిండియా ఫ్యాన్స్‌లో గుబులు పుట్టిస్తోంది...

click me!