బ్యాట్స్‌మెన్‌కి ఫ్రీ హిట్ ఇస్తే, బౌలర్లకి ఫ్రీ బాల్ ఎందుకివ్వరు... రవిచంద్రన్ అశ్విన్ కామెంట్...

Published : May 31, 2021, 04:30 PM IST

బౌలర్ గీత దాటి, బాల్ వేస్తే... బ్యాట్స్‌మెన్‌కి ‘ఫ్రీ హిట్’ ఇస్తారు. మరి బౌలర్ బంతి వేయకముందే, బ్యాట్స్‌మెన్ లైన్ దాటితే... ఎందుకు శిక్ష ఉండదు. బ్యాట్స్‌మెన్‌కి బోనస్ ఇచ్చి, బౌలర్లను మాత్రం ‘క్రీడా స్ఫూర్తి’ అంటూ ఎందుకు విమర్శిస్తారంటూ నిలదీశాడు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.

PREV
18
బ్యాట్స్‌మెన్‌కి ఫ్రీ హిట్ ఇస్తే, బౌలర్లకి ఫ్రీ బాల్ ఎందుకివ్వరు... రవిచంద్రన్ అశ్విన్ కామెంట్...

ఐపీఎల్ 2019 సమయంలో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహారించిన ఆర్ అశ్విన్, రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్‌ను ‘మన్కడింగ్’ విధానం ద్వారా అవుట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటికే ఇది పెద్ద వివాదాస్పదమైంది. 

28

రవిచంద్రన్ అశ్విన్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహారించాడని, టెస్టుల్లో స్టార్ ఆల్‌రౌండర్‌గా వెలుగొందుతున్న అశ్విన్ ఇలా చేయడం భావ్యం కాదని తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కొందరు ఫ్యాన్స్ అయితే అశ్విన్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేశారు.

38

‘క్రికెట్‌ మజాని పెంచడానికి బ్యాట్స్‌మెన్‌కి అనుకూలంగా నిర్ణయాలు చేస్తూ, బౌలర్లకు అన్యాయం చేస్తున్నారు. అందులో ఫ్రీ హిట్ కూడా ఒకటి, దాన్ని వెంటనే రద్దు చేయాలి’ అంటూ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కామెంట్ చేశాడు.

48

‘సంజయ్, ఫ్రీ హిట్ అనేది గొప్ప మార్కెటింగ్ టూల్. బ్యాట్స్‌మెన్ ఫ్రీ హిట్‌లో సిక్సర్లు కొడుతుంటే అభిమానులు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. అయితే బ్యాట్స్‌మెన్‌కి ఎలాగయితే ఫ్రీ హిట్ రూపంలో ఓ బోనస్ ఇస్తున్నారో, బౌలర్ అలాగే ఫ్రీ బాల్ ఇవ్వాలి.

58

బౌలర్ బంతి వేయకముందే నాన్‌స్ట్రైయికర్ క్రీజుదాటితే, దానికి ఫ్రీ బాల్ కేటాయించాలి. అంటే ఆ బాల్‌కి వికెట్ పడితే పర్లేదు, లేదా నాన్‌స్టైయికర్‌ను అవుట్ ప్రకటించాలి, లేదా అది అన్యాయంగా భావిస్తే జట్టు స్కోరులో 10 పరుగులు తగ్గించాలి...’ అంటూ అభిప్రాయపడ్డాడు రవిచంద్రన్ అశ్విన్.

68

రవిచంద్రన్ అశ్విన్ లేవనెత్తిన ఫ్రీబాల్ ప్రతిపాదనను తబ్రాయిజ్ షంషీ సపోర్ట్ చేశాడు. ఓ అభిమాని, అశ్విన్ కామెంట్‌కి ‘నాన్‌స్ట్రైయికర్ బంతి వేసేదాకా క్రీజుదాటకూడదు. అలా దాటితే ఎలా వార్నింగ్ లేకుండా రనౌట్ చేయడానికి బౌలర్లకు అధికారం ఇవ్వాలి’ అంటూ రిప్లై ఇచ్చాడు.

78

ఈ రిప్లైకి సమాధానంగా ‘నాన్ స్ట్రైయికర్‌ ముందుకి రావడం వల్ల బౌలర్లు బౌలింగ్ చేయకుండా వారిని మానసికంగా దెబ్బతీసినట్టే అవుతుంది’ అంటూ కామెంట్ చేశాడు...

88

దీనికి సౌతాఫ్రికా బౌలర్ షంషీ... ‘బౌలర్లు అందరూ ఎలాంటి భయం లేకుండా ఇలాగే చేయాలి. ఇది గేమ్ రూల్స్‌లో భాగమే. చాలామంది బౌలర్లు ఇలా చేయడం వల్ల క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహారిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. నిజానికి బౌలర్ ఏకాగ్రతను దెబ్బతీస్తూ నాన్‌స్ట్రైయికర్ ముందుకు రావడమే క్రీడా స్ఫూర్తికి విరుద్ధం... ఇదే నిజం’ అంటూ కామెంట్ చేశాడు.

click me!

Recommended Stories