ఇంకా ఆలస్యం కాలేదు, ఇప్పటికైనా భువనేశ్వర్ కుమార్‌ని ఇంగ్లాండ్‌కి రప్పించండి...

First Published Jun 22, 2021, 5:26 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను ఎక్కువగా మిస్ అవుతోంది టీమిండియా. ఇంగ్లాండ్‌లో మంచి రికార్డు ఉన్న భువీని ఎంపికచేయకపోవడం, భారత జట్టు పర్ఫామెన్స్‌పై ప్రభావం చూపిందని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

న్యూజిలాండ్ స్వింగ్ బౌలర్లు, ఫైనల్ మ్యాచ్‌లో అదరగొట్టాడు. ఇన్‌స్వింగ్, అవుట్ స్వింగ్‌లతో భారత బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. కేల్ జెమ్మీసన్ ఐదు వికెట్లు తీయగా నీల్ వాగ్నర్, ట్రెంట్ బౌల్ట్‌లకు చెరో రెండు వికెట్లు దక్కాయి...
undefined
న్యూజిలాండ్ బౌలింగ్ విభాగంతో పోలిస్తే భారత బౌలర్ల పర్ఫామెన్స్ ఇప్పటిదాకా ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టిన భారత పేసర్ బుమ్రాకి కూడా తొలి 60 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా దక్కలేదు...
undefined
బుమ్రా, షమీ కంటే ఇషాంత్ శర్మ మెరుగైన ప్రదర్శన రాబడుతుండడంతో భారతజట్టు సీనియర్ బౌలర్, ‘స్వింగ్ కింగ్’ భువనేశ్వర్ కుమార్‌ను ఎక్కువగా మిస్ అవుతోందని అంటున్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
undefined
‘భారత జట్టు ఫైనల్ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్‌ను మిస్ అవుతోంది. అతనిలో మూడు స్పెషలిటీలు ఉన్నాయి. మొదటిది అతను కొత్త బంతితో మ్యాజిక్ చేయగలడు. రెండోది అతను లాంగ్ స్పెల్స్ బౌలింగ్ చేయగలడు... మూడోది అతను బ్యాటింగ్ కూడా చేయగలడు...
undefined
ఇంగ్లాండ్‌లో అద్భుతమైన రికార్డు ఉన్న భువీని పక్కనబెట్టడం చాలా పెద్ద పొరపాటు. ఇక్కడి పిచ్‌లు స్వింగ్‌కి పర్ఫెక్ట్‌గా అనుకూలిస్తాయని తెలిసినా భారత జట్టు అమ్ములపొదిలో ఉన్న స్వింగ్ అస్త్రాన్ని ఉపయోగించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది...
undefined
కోలిన్ డి గ్రాండ్‌హోమ్ కూడా స్వింగ్ చేయగలుగుతున్నాడు. వాళ్ల జట్టులో సౌథీ, జెమ్మీసన్, ట్రెంట్ బౌల్ట్ కూడా స్వింగ్ రాబడుతున్నాడు. మనజట్టులో ఇషాంత్ శర్మ కాస్త స్వింగ్ చేస్తున్నా, మిగిలిన ప్లేయర్లు కావాల్సిన స్వింగ్ రాబట్టలేకపోతున్నారు..
undefined
ఎందుకంటే మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా స్వింగ్ బౌలర్లు కాదు, వాళ్లు సీమ్ బౌలర్లు. సీమ్ బౌలర్ ఎప్పుడూ స్వింగ్‌ని రాబట్టలేడు. కాబట్టి మనకి అందుబాటులో ఉన్న భువనేశ్వర్ కుమార్ లేదా దీపక్ చాహార్‌ని సరిగ్గా ఉపయోగించుకుని ఉంటే బాగుండేది’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
undefined
‘ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ సమయానికి అందుబాటులో ఉండేందుకు భువనేశ్వర్ కుమార్‌ని పిలిపించండి. ఒకవేళ అతను గాయంతో బాధపడుతున్నా, రెండు లేదా మూడు టెస్టులు అయినా ఆడించొచ్చు...
undefined
భువనేశ్వర్ కుమార్ లాంటి స్వింగ్ బౌలర్‌ సేవలను సరిగ్గా వినియోగించుకోవాల్సిన బాధ్యత టీమిండియాదే. ఈ పరిస్థితులు అతనికి సరిగ్గా సూట్అ వుతాయి. ఇప్పటికే భారత జట్టు స్వింగ్ బౌలర్‌ను మిస్ అవుతుండడాన్ని చూశాం...’ అంటూ మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ నాజర్ హుస్సేన్.
undefined
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి ఎంపిక కాని భువనేశ్వర్ కుమార్, శ్రీలంకతో జరిగే వన్డే, టీ20 సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...
undefined
click me!