జెర్సీ మరిచిపోయి, మైదానంలోకి జస్ప్రిత్ బుమ్రా... మొదటి ఓవర్ తర్వాత పరుగెత్తుకుంటూ...

First Published Jun 22, 2021, 4:37 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌లో ఐదో రోజు కూడా వర్షం అంతరాయం తప్పలేదు. ఉదయం నుంచి ఎలాంటి వర్ష సూచనలు లేకుండా కనిపించిన సౌంతిప్టన్‌లో సరిగా మ్యాచ్ సమయానికి చినుకులు పలకరించాయి...

వర్షం అంతరాయం కలిగించడంతో గంట ఆలస్యంగా ప్రారంభమైంది ఐదో రోజు ఆట. ఇప్పటికే మొదటి రోజుతో పాటు నాలుగో రోజు కూడా వర్షం కారణంగా ఒక్క బంతి వేయడానికి కూడా వీలు కాలేదు...
undefined
మ్యాచ్ ప్రారంభమైన తర్వాత మొదటి ఓవర్ వేసిన జస్ప్రిత్ బుమ్రా... ఆ తర్వాత వెంటనే పెవిలియన్‌కి పరుగులు తీశాడు. అంత ఆతృతగా బుమ్రా పెవిలియన్ చేరడానికి కారణం... అతను వేసుకున్న జెర్సీ...
undefined
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఐసీసీ ప్రత్యేకంగా జెర్సీ రూపొందించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో హడావుడిగా క్రీజులోకి వచ్చిన బుమ్రా, బీసీసీఐ పాత జెర్సీనే వేసుకుని వచ్చాడు.
undefined
మొదటి ఓవర్ వేస్తున్న సమయంలో అంపైర్లు ఈ విషయాన్ని గమనించి, చెప్పడంతో... తన తప్పును తెలుసుకున్న జస్ప్రిత్ బుమ్రా... ఆరు బంతులు పూర్తిచేసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి తన జెర్సీని మార్చుకుని వచ్చాడు...
undefined
మూడో రోజు 11 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చిన జస్ప్రిత్ బుమ్రా, సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. అయితే ఈరోజు అతని బౌలింగ్ చాలా మెరుగైనట్టు స్పష్టంగా కనిపించింది.
undefined
తొలి సెషన్‌లో మొదటి ఓవర్‌తో ఓపెనింగ్ చేసిన బుమ్రా, తొలి రెండు ఓవర్లలో ఒక్క నో బాల్ మినహా సింగిల్ పరుగు కూడా ఇవ్వలేదు...
undefined
ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉండడం, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ కూడా పూర్తి కాకపోవడంతో ఫైనల్ మ్యాచ్‌లో ఫలితం తేలడం అసాధ్యమే అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
undefined
click me!