ఫైనల్‌ని అస్సలు పట్టించుకోని ఫ్యాన్స్... డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదే..

First Published Jun 22, 2021, 3:32 PM IST

టీ20లకు ఉన్న క్రేజ్, వన్డేలకు ఉండదు. వన్డేలకు ఉన్న వ్యూయర్‌షిప్, టెస్టు మ్యాచులకు ఉండదు... అయితే ఐదురోజుల పాటు సాగే టెస్టులు ఇచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. అందుకే టెస్టు మ్యాచులు చూసేందుకు అసలైన క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌కీ, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది..
undefined
ఫైనల్ మ్యాచ్‌కి ముందు జరిగిన ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను కూడా ఆసక్తిగా వీక్షించారు క్రికెట్ ఫ్యాన్స్. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఎలా ఆడుతుందో ఓ అంచనా వేసేందుకు ఆ టెస్టు సిరీస్‌ను ఇంట్రెస్టింగ్‌గా ఫాలో అయ్యారు అభిమానులు...
undefined
అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి మాత్రం ఏ మాత్రం ఆదరణ దక్కడం లేదు. కారణం వాతావరణమే. వాస్తవానికి ఫైనల్ మ్యాచ్‌ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఎప్పుడెప్పుడు మ్యాచ్ ప్రారంభమవుతుందా? అని వెయి కళ్లతో వెయిట్ చేశారు...
undefined
అయితే సౌంతిప్టన్‌లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో తొలి రోజే వర్షం కారణంగా రద్దు కావడంతో చాలామందికి ఈ మ్యాచ్‌‌పై ఆసక్తి అమాంతం పడిపోయింది...
undefined
ఆస్ట్రేలియా టూర్‌‌లో టీమిండియా ఆడిన మ్యాచ్‌లకు యావరేజ్‌గా 2.5 నుంచి 3 మిలియన్ల మంది డిస్నీ+హాట్ స్టార్‌లో లైవ్ చూశారు. అదే ఐపీఎల్, టీ20 మ్యాచులు అయితే ఈ సంఖ్య 4 నుంచి 5 మిలియన్ల వరకూ ఉంటుంది...
undefined
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్ వస్తుందని ఆశించింది డిస్నీ+ హాట్ స్టార్... అయితే వాతావరణం కారణంగా టీమిండియా బ్యాటింగ్ చేసిన రెండో రోజు వ్యూయర్‌షిప్ యావరేజ్ 1.5 మిలియన్‌ కూడా దాటలేదు...
undefined
మూడో రోజు అయితే పరిస్థితి మరీ దారుణంగా పడిపోయింది. 0.8 మిలియన్ నుంచి 1.5 మిలియన్ల మధ్యలోనే సాగిన వ్యూయర్‌షిప్, 2 మిలియన్ మార్కును కూడా అందుకోకపోవడం క్రికెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది...
undefined
డిస్నీ+ హాట్ స్టార్‌లోనే తక్కువనుకుంటే, టీవీల్లో లైవ్ చూసేవారి సంఖ్య కూడా మరీ దారుణంగా ఉందట. తొలి రోజే వర్షం కారణంగా రద్దు కావడంతో రెండో రోజు కూడా బ్యాడ్ లైట్ అంతరాయం కలిగించడం, మూడో రోజు ఇంట్రెస్టింగ్‌గా లేకపోవడంతో ఫైనల్ మ్యాచ్‌ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు...
undefined
సౌంతిప్టన్‌లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ రిజల్ట్ తేలకపోయినా, వ్యూయర్‌షిప్‌లో కూడా ఫ్లాప్‌గా రికార్డు నమోదుచేసింది. దీనంతటకీ ఐసీసీ వ్యూహాత్మక తప్పిదమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
undefined
అయితే ఫైనల్ మ్యాచ్‌లో ఇంకా రెండు రోజులు మిగిలి ఉంది. ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్లు సెంచరీ చేసినా, భారత బౌలర్ల నుంచి అద్భుతమైన పర్ఫామెన్స్ వచ్చినా వ్యూయర్‌షిప్ ఆకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది.
undefined
click me!