ICC World cup Final: సచిన్, సెహ్వాగ్, యువీ, జహీర్, భజ్జీ... అరుదైన జాబితాలో చేరిన విరాట్ కోహ్లీ...

First Published | Nov 19, 2023, 2:16 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత జట్టు వరుసగా 10 విజయాలతో ఫైనల్‌కి దూసుకెళ్లింది. ఆఖరి మ్యాచ్‌లో గెలిచి, 12 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలవాలని కసిగా ఉంది భారత జట్టు...
 

Virat Kohli

అహ్మదాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ... అరుదైన ఫీట్ సాధించాడు. రెండు సార్లు వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడిన భారత క్రికెటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ..

2003 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరిన భారత జట్టు, 2011 వన్డే వరల్డ్ కప్‌లో టైటిల్ గెలిచింది. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్... 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌తో పాటు 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఆడారు..

Latest Videos


2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న విరాట్ కోహ్లీ, 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్నాడు. రెండు వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడిన ఆరో భారత క్రికెటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ..
 

ఫైనల్‌లో భారత జట్టు గెలిస్తే.. రెండు వరల్డ్ కప్ టైటిల్స్ గెలిచిన భారత క్రికెటర్లుగా విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ రికార్డు క్రియేట్ చేస్తారు. 

Virat Kohli

ఇంతకుముందు ఏ భారత క్రికెటర్ కూడా రెండు సార్లు వరల్డ్ కప్ టైటిల్స్ గెలవలేదు.. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రవీంద్ర జడేజా, 2011 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయారు..  

click me!