ఆ ముగ్గురినీ ఊరిస్తున్న సచిన్ టెండూల్కర్ 673 పరుగుల రికార్డు! రేసులో విరాట్ కోహ్లీ కూడా...

First Published | Nov 6, 2023, 2:49 PM IST

2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో సచిన్ టెండూల్కర్ చేసిన 673 పరుగుల రికార్డు, 20 ఏళ్లు అయినా ఇప్పటికీ ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు. కొందరు 600+ మార్కు దాటినా సచిన్ టెండూల్కర్ రికార్డును మాత్రం అందుకోలేకపోయారు.
 

rohit sharma

2019 వన్డే వరల్డ్ కప్‌లో 5 సెంచరీలతో రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ 648 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్ 647 పరుగులు చేశాడు. షకీబ్ అల్ హసన్ 606 పరుగులు చేశాడు.

Quinton de Kock

2023 వన్డే వరల్డ్ కప్‌లో ఇప్పటికే ముగ్గురు ప్లేయర్లు 500+ మార్కు దాటేశారు. క్వింటన్ డి కాక్ 3 సెంచరీలతో 550 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. సౌతాఫ్రికా సెమీస్ చేరడంతో  డి కాక్ మరో 2 మ్యాచులు ఆడడం గ్యారెంటీ..
 

Latest Videos


ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఆడే అవకాశాలే ఎక్కువ. ఈ రెండు మ్యాచుల్లో 123 పరుగులు చేస్తే, సచిన్ టెండూల్కర్ 673 పరుగుల రికార్డును అందుకోగలుగుతాడు క్వింటన్ డి కాక్..
 

Quinton De Kock

విరాట్ కోహ్లీ 543 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్‌కి ఆ మ్యాచ్‌లో రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఆడితే, సచిన్ రికార్డుకి విరాట్ మరింత చేరువవుతాడు..

Virat Kohli

సెమీ ఫైనల్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌తో ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. న్యూజిలాండ్, లంక చేతుల్లో ఓడిపోతే మాత్రం పాకిస్తాన్ లక్కీగా సెమీస్‌కి రావచ్చు. అప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగవచ్చు...
 

Rachin Ravindra

న్యూజిలాండ్ యంగ్ సెన్సేషన్ రచిన్ రవీంద్ర 8 మ్యాచుల్లో 523 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్, శ్రీలంకతో మ్యాచ్ ఆడుతోంది. సెమీస్ చేరాలంటే న్యూజిలాండ్‌కి ఈ మ్యాచ్ చాలా కీలకం..

David Warner

ఈ మ్యాచ్‌లో బాగా ఆడితే, న్యూజిలాండ్‌ని సెమీస్ చేర్చడంతో పాటు తన పేరులో ఉన్న ‘సచిన్’ రికార్డుకు కూడా చేరువవుతాడు రచిన్ రవీంద్ర. 2019 సీజన్‌లో సచిన్ రికార్డును అందుకోలేకపోయిన డేవిడ్ వార్నర్ కూడా ఈ రేసులో ఉన్నాడు.
 

7 మ్యాచుల్లో 428 పరుగులు చేశాడు డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా చివరి లీగ్ మ్యాచుల్లో ఆఫ్ఘాన్, బంగ్లాదేశ్‌లతో తలబడుతోంది. ఈ రెండు మ్యాచుల్లో ఒక్క సెంచరీ చేసినా వార్నర్, సచిన్ రికార్డుకు దగ్గరగా వచ్చేస్తాడు. 

442 పరుగులు చేసిన రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ 673 పరుగుల రికార్డును అందుకోవాలంటే ఓ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. అలాగే ఆ తర్వాతి ప్లేసుల్లో ఉన్న ప్లేయర్లు 400+ మార్కు కూడా దాటలేకపోయారు. కాబట్టి సచిన్ టెండూల్కర్ రికార్డును అందుకోవడం కష్టం.. 

click me!