ఆఫ్ఘాన్‌పై హ్యాట్రిక్ తీసిన మహ్మద్ షమీని కాదని శార్దూల్ ఠాకూర్‌కి ప్లేస్... పసికూనతో మ్యాచ్‌లోనూ...

First Published | Oct 11, 2023, 5:05 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా ఆఫ్ఘాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కి రెస్ట్ ఇచ్చి, శార్దూల్ ఠాకూర్‌కి చోటు కల్పించింది టీమిండియా మేనేజ్‌మెంట్. అయితే ఈ మార్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..
 

Ravichandran Ashwin

‘రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ విన్నర్. అతను ఏం తప్పు చేశాడని ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో టీమ్‌లో చోటు కోల్పోయాడో నాకు అర్థం కావడం లేదు. ఇది ఈజీ నిర్ణయం కాదు. ఎంతో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం..

Mohammed Shami

ఒకవేళ రవిచంద్రన్ అశ్విన్‌ని కూర్చోబెట్టి, మూడో పేసర్‌ని ఆడించాలని అనుకుంటే మహ్మద్ షమీకి కచ్ఛితంగా చోటు ఉండాలి. ఎందుకంటే 2019 వన్డే వరల్డ్ కప్‌లో మహ్మద్ షమీ, ఆఫ్ఘాన్‌పై హ్యాట్రిక్ తీశాడు...


థ్రిల్లింగ్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసి టీమిండియాని గెలిపించాడు. మహ్మద్ షమీని ఆడిస్తే ఆఫ్ఘాన్‌పై మానసికంగా ప్రెషర్ పెట్టినట్టు కూడా అవుతుంది. 
 

Mohammad Shami

ఆఫ్ఘానిస్తాన్‌ లైనప్‌కి అతని బౌలింగ్ బాగా సెట్ అవుతుంది.. మరి షమీని కాదని శార్దూల్ ఠాకూర్‌కి ఎందుకు అవకాశం ఇచ్చారో అర్థం కావడం లేదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్..

ఆఫ్ఘాన్‌‌కి మంచి బౌలింగ్ లైనప్ ఉండడం వల్లే, బ్యాటింగ్ డెప్త్ కోసం శార్దూల్ ఠాకూర్‌ని తుది జట్టులోకి తీసుకొచ్చినట్టు రోహిత్ శర్మ తెలిపాడు.

అయితే ఆస్ట్రేలియాపైనే శార్దూల్ లేకుండా ఆడిన టీమిండియా, ఆఫ్ఘాన్‌ వంటి పసికూనపై బ్యాటింగ్ డెప్త్ కోసం అతన్ని తెచ్చామని చెప్పడం మాత్రం హాస్యాస్పదంగా ఉందంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. 

Latest Videos

click me!