వరల్డ్ కప్‌కి ముందు టీమిండియాకి అపశకునాలు.. నెట్స్‌లో హార్ధిక్ పాండ్యాకి గాయం! అటు గిల్‌ కూడా..

First Published | Oct 6, 2023, 3:49 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఆసియా కప్ టైటిల్ గెలిచిన భారత జట్టు, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది. టైటిల్ ఫెవరెట్‌గా ప్రపంచ కప్‌లో బరిలో దిగబోతున్న టీమిండియాకి వరుసగా అపశకునాలు ఎదురవుతున్నాయి.

2023 ఏడాదిలో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, డెంగ్యూ బారిన పడిన విషయం తెలిసిందే. శుబ్‌మన్ గిల్, మొదటి  మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదని వార్తలు వస్తున్నాయి... 
 

శుబ్‌మన్ గిల్ త్వరగా కోలుకుని, ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ ఆడినా తన సుప్రీమ్ ఫామ్‌ని కొనసాగించగలడా? అనేది అనుమానమే. గిల్ ఆడకపోతే ఇషాన్ కిషన్‌తో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది..
 

Latest Videos


వన్డేల్లో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌కి అదిరిపోయే రికార్డు కూడా ఉంది. ఓపెనర్‌గా డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్, వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లోనూ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాదాడు.. 

Hardik Pandya


తాజాగా అక్టోబర్ 5న నెట్స్ ప్రాక్టీస్ సెషన్స్‌లో ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకి గాయమైనట్టు సమాచారం. ప్రాక్టీస్ సెషన్స్‌లో సిరాజ్ వేసిన ఓ బౌన్సర్, హార్ధిక్ పాండ్యా వేలికి బలంగా తగిలింది. దీంతో అతను బ్యాటింగ్ సెషన్స్ నుంచి తప్పుకున్నాడు..
 

Hardik Pandya

హార్ధిక్ పాండ్యా గాయం తీవ్రమైనది అయితే, ఆ ప్రభావం టీమిండియాపై భారీగా పడుతుంది. ఎందుకంటే భారత జట్టుకి ఉన్నదే ఒకే ఒక్క ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్. అతను కూడా గాయంతో ఆడకపోతే, ఇక భారత టీమ్ కాంబినేషన్‌‌ మొత్తం చెడిపోతుంది.

హార్ధిక్ పాండ్యాకి ఉన్న ఒకే ఒక్క రిప్లేస్‌మెంట్ శార్దూల్ ఠాకూర్. అయితే శార్దూల్ బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ హార్ధిక్ పాండ్యాని మ్యాచ్ చేయలేవు. వెంకటేశ్ అయ్యర్, ఆశాకిరణంలా కనిపించినా అతన్ని సరైన ఆల్‌రౌండర్‌గా తయారుచేయడంలో టీమిండయా మేనేజ్‌మెంట్‌ విఫలమైంది..
 

దీంతో హార్ధిక్ పాండ్యా త్వరగా కోలుకోకపోతే టీమిండియాపై ఆ ప్రభావం తీవ్రంగా పడుతుంది. అయితే హార్ధిక్ పాండ్యా గాయం గురించి బీసీసీఐ ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా భారత జట్టు, అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడనుంది. 

click me!