తనకు ఇష్టమైన టాప్-5 టీ20 క్రికెటర్ల లిస్టు చెప్పేసిన రషీద్ ఖాన్.. టాప్ ప్లేస్ లో భారత సారథి

Published : Oct 12, 2021, 02:50 PM ISTUpdated : Oct 12, 2021, 02:52 PM IST

ICC T20 World Cup: ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్  స్పిన్నర్ రషీద్ ఖాన్ తనకు ఇష్టమైన టాప్ 5  క్రికెటర్ల లిస్టు చెప్పేశాడు.  మరో వారం రోజుల్లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మొదలుకానున్న నేపథ్యంలో టీ20 ఫార్మాట్ లో రషీద్.. టాప్5 క్రికెటర్ల లిస్టును వెల్లడించాడు. వాళ్లెవరో ఇక్కడ చూద్దాం. 

PREV
16
తనకు ఇష్టమైన టాప్-5 టీ20 క్రికెటర్ల లిస్టు చెప్పేసిన రషీద్ ఖాన్.. టాప్ ప్లేస్ లో భారత సారథి

ఈనెల 17 నుంచి యుఏఈ వేదికగా T20 World Cup మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్  క్రికెటర్ Rashid Khan.. టీ20 ఫార్మాట్ లో తనకు నచ్చిన ఐదుగురు ఆటగాళ్ల పేర్లను చెప్పేశాడు.. ఇందులో ఇద్దరు Team india ప్లేయర్లుండటం గమనార్హం. రషీద్ చెప్పిన జాబితాను ఓసారి పరిశీలిస్తే... 

26


విరాట్ కోహ్లి: భారత సారథి Virat Kohli అంటే రషీద్ ఖాన్ కు ప్రత్యేకఅభిమానం. కోహ్లి గురించి రషీద్ మాట్లాడుతూ..  ప్రపంచంలోని ఏ వికెట్ పై అయినా ధీటుగా నిలబడి ఆడే ఆటగాడు అని కితాబిచ్చాడు. ఐపీఎల్, టీమిండియా తరఫున కలిపి కోహ్లి..  టీ20 ఫార్మాట్ లో 10,136 పరుగులు చేశాడు. 

36

హర్ధిక్ పాండ్యా : భారత ఆల్ రౌండర్ హర్ధిక్ పాండ్యా తనకు ఇష్టమైన క్రికెటర్లలో చోటు కల్పించాడు రషీద్. Hardik Pandya వంటి ఆటగాళ్లు జట్టులో ఉంటే అది టీమ్ కు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నాడు. 

46

కేన్ విలియమ్సన్ : న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టెస్టుల్లోనే గాక టీ20 ఫార్మాట్ లో ప్రమాదకర ఆటగాడే. అంతర్జాతీయ కెరీర్ టీ20 ఫార్మాట్ లో Kane williamson స్ట్రైక్ రేట్ 125.08. సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్ గా ఉన్న  విలియమ్సన్.. కూల్ గా ఉంటూ జట్టును ముందుండి నడిపిస్తాడని రషీద్ తెలిపాడు. 

56

ఏబీ డివిలియర్స్ : దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ ను విధ్వంసకర  ఆటగాడిగా రషీద్ అభివర్ణించాడు. పరిస్థితులు ఎలా ఉన్నా.. తన ముందు ఎంతటి బౌలర్ ఉన్నా వారిపై విరుచుకుపడటమే డివిలియర్స్ కు అలవాటని కితాబిచ్చాడు. మిస్టర్ 360 లాంటి  ఆటగాడు జట్టులో ఉండాలని ప్రతి కెప్టెన్ కోరుకుంటాడని ప్రశంసించాడు. 

66

కీరన్ పొలార్డ్ : వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు కీరన్ పొలార్డ్ తన ఫేవరేట్ ఆటగాళ్లలో ఒకడిగా రషీద్ తెలిపాడు. తన జట్టులో పొలార్డ్ కు ఆల్ రౌండర్ గా స్థానం కల్పిస్తానని చెప్పాడు. పొలార్డ్, పాండ్యా వంటి ఆల్ రౌండర్లు జట్టులో ఉంటే ఆ జట్టుకు ఎంతో లాభిస్తుందని రషీద్ పేర్కొన్నాడు. 

click me!

Recommended Stories