India vs Netherlands
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఆఖరి బంతికి ఉత్కంఠ విజయం అందుకున్న టీమిండియా, నెదర్లాండ్స్‌పై భారీ విజయాన్ని మూటకట్టుకుంది. ఇక మిగిలిన మ్యాచుల్లో సౌతాఫ్రికా గండాన్ని దాటితే... బంగ్లా, జింబాబ్వేలపై మ్యాచులు గెలిస్తే సరిపోతుంది..
అయితే లక్కీగా సెమీ ఫైనల్ చేరినా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా అంతకుమించి ముందుకు వెళ్లదని కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్... ‘పాకిస్తాన్ టీమ్ బాలేదు, వాళ్ల ఆట తీరు కూడా అంతే. ఐసీసీ టోర్నీలకు యావరేజ్ టీమ్‌ని సెలక్ట్ చేసి, యావరేజ్ ఆట ఆడిస్తే... ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి.
అయితే పాకిస్తాన్ టీమ్, సూపర్ 12 రౌండ్ నుంచి ఇంటిదారి పడుతుందని ముందుగానే ఊహించా. టీమిండియా మరో వారం ఆడుతుందంతే. వాళ్లు కూడా వచ్చేవారం ఇంటికి వచ్చేవారు. సెమీ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడం పక్కా...
ఎందుకంటే వాళ్లేం తీస్ మాన్ ఖాన్‌లు కాదు. పాకిస్తాన్ టీమ్ ఎలాగైతే యావరేజ్‌గా ఉందో టీమిండియా కూడా అంతే. అయితే మన టీమ్, వాళ్ల కంటే చెత్తగా ఉంది అంతే... ఐసీసీ టోర్నీలు గెలవాలంటే కావాల్సిన రేంజ్ ఇరు జట్ల దగ్గరా లేదు...
babar
ఈ ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లతో మీరు మ్యాచులేం గెలుస్తారు. పాక్‌కి ఓ చెత్త కెప్టెన్ దొరికాడు. రెండో గేమ్‌లోనే పాకిస్తాన్, వరల్డ్ కప్ నుంచి నిష్కమించింది. మరీ జింబాబ్వేతో మ్యాచ్ ఓడిపోతారని ఎవరు మాత్రం అనుకుంటారు...
షాహీన్ ఆఫ్రిదీ ఫిట్‌గా ఉన్నాడా? అతను ఫిట్‌గా లేకపోయినా ఆడించాలని ఆడిస్తున్నారా? మన ఓపెనర్లకు 30 యార్డ్ సర్కిల్‌ని ఎలా వాడుకోవాలో కూడా తెలీదు. ఫకార్ జమాన్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చెబెడుతున్నారు. అతని అనుభవాన్ని వాడుకోవడం లేదు...
Babar and Rizwan
ఫకార్ జమాన్ లాంటి బ్యాక్ ఫుట్ బ్యాటర్, ఆస్ట్రేలియాలో బాగా ఆడగలడు. ఇంత చెత్తగా ఆడితే జనాలకు ముఖాలు ఎలా చూపించగలం. వాళ్లు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారు? ఓ ప్లాన్ లేదు, ఓ మిడిల్ ఆర్డర్ లేదు... సరైన ఓపెనర్లు లేరు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...