సౌతాఫ్రికాతో మ్యాచ్ డ్రాగా ముగియడం, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో విజయం అందుకున్న జింబాబ్వే... సెమీస్ రేసులో నిలిచింది. అదీకాకుండా తొలి రెండు మ్యాచుల్లో అద్భుతమైన బౌలింగ్ చూపించిన భారత బౌలర్లకు అసలు సిసలు పరీక్ష సఫారీలతో జరిగే మ్యాచ్‌లోనే...
Kagiso Rabada
‘సౌతాఫ్రికాలో కగిసో రబాడా, ఆన్రీచ్ నోకియా వంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. వాళ్లని ఎదుర్కోవడానికి మా ప్లాన్స్ మాకున్నాయి. బౌన్సీ పిచ్‌ల మీద ఆడడానికి మేం ఎప్పుడూ భయపడం...
వాళ్ల దగ్గర నోకియా, రబాడా ఉంటే మా దగ్గర విరాట్ భాయ్ ఉన్నాడు. విరాట్ భాయ్ ఫామ్‌లో ఉంటే ఏ బౌలర్ అయినా చేతులు ఎత్తేయాల్సిందే... మాకు బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి సమస్యలు లేవు...
ఓ బౌలర్‌గా సక్సెస్ సాధించడానికి బ్యాటర్‌కి ఛాన్సులు ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని సార్లు వికెట్ పడుతుందని చెప్పలేం. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ తీయలేకపోవడం తీవ్రంగా నిరాశకు గురి చేసింది. అందుకే ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత బౌలింగ్ కోచ్‌తో కలిసి వీడియోలు చూశా..
Image credit: PTI
నేను వేసిన 6 బంతుల్లో 5 పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో ఉన్నాయి. ఒక్క బాల్ మాత్రమే లైన్ తప్పింది. కొన్నిసార్లు మనం బాగా వేసినా పరుగులు సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు జరిగింది అదే. అయితే దాని గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతాం... ’ అంటూ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు అక్షర్ పటేల్...