ఒక్కో స్టేడియానికి రూ.50 కోట్లు... వన్డే వరల్డ్ కప్‌ 2023 ఏర్పాట్ల కోసం 100 రోజుల ముందు నుంచే...

Published : Jun 30, 2023, 12:13 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ అంతకుముందున్న రికార్డులన్నీ ఇరగేసి తిరగేసింది. మీడియా హక్కుల విక్రయం ద్వారానే రూ.45 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన బీసీసీఐ, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం ఏర్పాట్లు అదిరిపోయేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది..

PREV
17
ఒక్కో స్టేడియానికి రూ.50 కోట్లు... వన్డే వరల్డ్ కప్‌ 2023 ఏర్పాట్ల కోసం 100 రోజుల ముందు నుంచే...
ICC World Cup

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ట్రోఫీని అంతరిక్షంలో ఆవిష్కరించింది బీసీసీ. 1,20,000 అడుగుల ఎత్తున ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 ట్రోఫీని ఆవిష్కరించారు...

27
ICC World Cup

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ జూన్ 27 నుంచి కువైట్, మలేషియా, యూఎస్‌ఏ, నైజీరియా, పాకిస్తాన్ వంటి 18 దేశాలు తిరిగి తిరిగి సెప్టెంబర్ 4న స్వదేశానికి తిరిగి రానుంది...

37

అక్టోబర్ 5 నుంచి మొదలయ్యే వన్డే వరల్డ్ కప్‌ 2023 ట్రోఫీకి దేశంలోని 12 ముఖ్య నగరాలు వేదిక ఇవ్వబోతున్నాయి. హైదరాబాద్‌లో మూడు మ్యాచులు జరగబోతుంటే గౌహతి, తిరువనంతపురంలో వార్మప్ మ్యాచులు జరుగుతాయి..

47

అహ్మదాబాద్‌లో మొదలయ్యే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ, మళ్లీ అహ్మదాబాద్‌లోనే జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ధర్మశాలతో పాటు ఢిల్లీ, చెన్నై, లక్నో, పూణే, బెంగళూరు, ముంబై, కోల్‌కత్తా నగరాల్లో లీగ్ మ్యాచులు జరుగుతాయి..

57

ఐపీఎల్ 2023 సీజన్ సమయంలో కొన్ని స్టేడియాల్లో సరైన సిట్టింగ్ సౌకర్యాలు లేకపోవడంతో పాటు ఫ్లడ్ లైట్స్ సరిగ్గా వెలగకపోవడం, వర్షం వస్తే పిచ్‌ని కప్పి ఉంచేందుకు సరైన కవర్లు కూడా లేకపోవడం వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి..

67

వేల కోట్ల లాభాలు, లక్ష కోట్ల బిజినెస్‌ చేస్తున్న బీసీసీఐ, కనీస సౌకర్యాల కల్పనల కోసం విఫలమయ్యిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ విషయంలో ఇలాంటి విమర్శలు రాకుండా జాగ్రత్త పడుతోంది బీసీసీఐ..

77

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్న ప్రతీ స్టేడియానికి రూ.50 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో స్టేడియాల్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించబోతున్నారు. మౌళిక సదుపాయాల నిర్మాణంతో పాటు మ్యాచ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను చేయాల్సిందిగా బీసీసీఐ సూచించింది..

click me!

Recommended Stories