నాకు వేరే టీమ్స్ నుంచి కెప్టెన్సీ ఆఫర్లు వచ్చాయి, ధోనీ అలా చెప్పేసరికి... సురేష్ రైనా కామెంట్స్..

First Published Jun 30, 2023, 11:36 AM IST

ఐపీఎల్‌లో సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన ప్లేయర్ సురేష్ రైనా. టీమిండియాకి ఆడిన దానికంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనే సూపర్ సక్సెస్ సాధించి, ‘మిస్టర్ ఐపీఎల్’గా గుర్తింపు తెచ్చుకున్న సురేష్ రైనా, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఆప్తమిత్రుడు..
 

చెన్నై సూపర్ కింగ్స్‌కి మూడు ఐపీఎల్ టైటిల్స్ అందించిన సురేష్ రైనా, 2021 వరకూ ధోనీ తర్వాత సెకండ్ రిటెన్షన్ పొందుతూ వచ్చాడు. 2022లో మొదటిసారి సురేష్ రైనాని వేలానికి వదిలేసిన చెన్నై సూపర్ కింగ్స్, తిరిగి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు..

ఐపీఎల్ 2022 సీజన్‌లో అమ్ముడుపోని సురేష్ రైనా, అదే ఏడాదిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. అంతకుముందు 2020 ఆగస్టులో మాహీతో పాటే అంతర్జాతీయ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు రైనా..
 

‘నేను ఉత్తరప్రదేశ్ టీమ్‌కి కెప్టెన్సీ చేశా. మాహీ లేనప్పుడు చెన్నై టీమ్‌కి కూడా సారథిగా వ్యవహరించా. ఐపీఎల్‌లో చాలా టీమ్స్ నుంచి నాకు ఆఫర్లు వచ్చాయి, కెప్టెన్సీ ఇస్తామని కూడా చెప్పారు. అయితే ధోనీ భాయ్ మాత్రం నన్ను టీమ్ విడిచి పోవద్దని చెప్పాడు..

తాను చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌గా ఉన్నంత కాలం, నన్ను వైస్‌ కెప్టెన్‌గా ఉంచుతానని హామీ ఇచ్చాడు. అందుకే వేరే టీమ్స్‌కి వెళ్లాలని, కెప్టెన్సీ చేయాలని ఎప్పుడూ ఆశపడలేదు. నేనెప్పుడూ టీమ్ ప్లేయర్‌గానే ఉన్నాను..

నా టీమ్‌ మేట్స్‌కి అవసరమైన సాయం చేయడం, వారి సమస్యలను అర్థం చేసుకోవడం, వాటిని పరిష్కరించేందుకు ఏం చేయాలో ఆలోచించడం మాత్రమే నాకు తెలుసు. పదవులు కోరుకోలేదు... ’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా..
 

ఆకాశ్ చోప్రా హోస్ట్ చేస్తున్న ‘హోమ్ ఆఫ్ హీరోస్’ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సురేష్ రైనా.. ‘నేను నెట్స్‌లో ముత్తయ్య మురళీధరన్, హర్భజన్ సింగ్, మొయిన్ ఆలీ, ఇమ్రాన్ తాహీర్ వంటి గొప్ప గొప్ప స్పిన్నర్లను ఎదుర్కొన్నాను..

అయితే నాకు ధోనీ బౌలింగ్‌ ఆడడమే చాలా కష్టంగా అనిపించింది. మాహీ ఆఫ్ స్పిన్ వేస్తాడు, స్పిన్ వేస్తాడు కదా అని ప్రిపేర్ అయితే మీడియం పేస్ బౌలింగ్‌ చేస్తాడు. ఒకే అలాగే చూద్దామని ఫిక్స్ అయితే లెగ్ స్పిన్‌తో పల్టీ కొట్టిస్తాడు. అతనికి అన్ని రకాల బౌలింగ్స్ తెలుసు...’ అంటూ కామెంట్ చేశాడు సురేష్ రైనా.. 

click me!