మేమూ మనుషులమే, ఆరు నెలలుగా... అలసిపోయాం... వరల్డ్‌కప్ పర్పామెన్స్‌పై జస్ప్రిత్ బుమ్రా...

First Published Nov 1, 2021, 4:22 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియా పర్ఫామెన్స్, ప్రతీ క్రికెట్ లవర్‌ని కలిచివేసింది. జట్టు నిండా స్టార్ క్రికెటర్లు ఉన్నా, కీలక మ్యాచుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా సరిగా ఆడకపోవడం, అభిమానులను ఆవేదనకు గురి చేస్తోంది...

టీమిండియాకి పరాజయాలు కొత్తేమీ కాదు. ప్రతీ ఆటలోనూ గెలుపు ఓటములు సహజం. అయితే వరుసగా రెండు మ్యాచుల్లో ఎదురైన ఓటములు చూస్తుంటే మాత్రం భారత జట్టు ఆటతీరు, స్కాట్లాండ్ వంటి చిన్న జట్ల కంటే ఘోరంగా ఉంది...

వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్న జట్టు, రెండు మ్యాచుల్లో కలిసి తీసింది రెండంటే రెండు వికెట్లు మాత్రమే. అది కూడా జస్ప్రిత్ బుమ్రా ఒక్కడే తీశాడు. మిగిలిన బౌలర్లు వికెట్ తీయలేకపోయారు...

మొదటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నిలబడ్డాడు, అతనితో పాటు రిషబ్ పంత్ మెరుపులు మెరిపించాడు. ఫలితంగా పాకిస్తాన్ ముందు 150+ పరుగుల స్కోరు చేయగలిగింది టీమిండియా...

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నిలబడలేకపోయాడు. కోహ్లీ కోసం పక్కా ప్లానింగ్‌తో స్కెచ్‌ తీసి స్పిన్ బౌలర్లతో ఒత్తిడి పెంచిన న్యూజిలాండ్ ఫలితం రాబట్టింది. కోహ్లీ ఆడకపోతే భారత జట్టు పరిస్థితి ఏంటో మరోసారి తేలిపోయింది...

భారత ఇన్నింగ్స్‌లో ఏకంగా 11 ఓవర్ల పాటు బౌండరీ రాకపోవడం, క్రికెట్ లవర్స్‌ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్‌తో మ్యాచ్‌లో బౌలర్లు దారుణంగా ఫెయిల్ అయితే, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు..

‘ఆరు నెలలుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాం. ఇంగ్లాండ్ టూర్‌లో నాలుగు టెస్టులు ఆడిన తర్వాత వెంటనే ఐపీఎల్ ఆడాల్సి వచ్చింది. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్...

సొంత ఇంటికి, కుటుంబాన్ని వదిలేసి, బయో బబుల్‌లో జీవితం గడుపుతున్నాం. అవును, బీసీసీఐ మాకు కష్టం కలగకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది...

భార్యాపిల్లలతో కలిసి ఉండేందుకు అవకాశం కల్పించింది. అయినా ఎంతైనా మేమూ మనుషులమే కదా.. కరోనా కారణంగా బరి గీసుకుని బతకాల్సి వస్తోంది...

ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆటగాడిపైనైనా ప్రభావం చూపిస్తాయి. శారీరకంగా ఫిట్‌గా ఉన్నా, మానసికంగా చాలా అలసిపోయాం... అందుకేనేమో నూటికి నూరు శాతం ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా..

టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీస్ ఆడనుంది భారత జట్టు. ఈ సిరీస్‌లో మూడు టీ20 మ్యాచులు, రెండు టెస్టులు ఆడుతుంది...

ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్టు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత వెస్టిండీస్‌తో, శ్రీలంకతో సిరీస్‌లు ఆడనుంది...

ఆ రెండు సిరీస్‌లు ముగిసిన తర్వాత ఐపీఎల్ మొదలవుతుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో పది జట్లు ఉండడంతో 74 రోజుల పాటు సుదీర్ఘంగా సాగనుంది... అంటే దాదాపు మూడు నెలల పాటు క్రికెటర్లు ఫుల్లు బిజీ...

ఐపీఎల్ ముగిసిన తర్వాత మళ్లీ ఇంగ్లాండ్ టూర్ ఉంటుంది. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్ 2022... అంటే వచ్చే ఏడాదిలో 365 రోజులుంటే దాదాపు 250 నుంచి 300 రోజుల పాటు క్రికెట్ ఆడుతూ యమా బిజీగా ఆడుతూ అలిసిపోనున్నారు మన క్రికెటర్లు...

click me!