బాబర్ ఆజమ్‌‌ ర్యాంకుని కాపాడిన శుబ్‌మన్ గిల్ అనారోగ్యం... వరుస మ్యాచుల్లో విఫలమైనా..

First Published | Oct 11, 2023, 5:45 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో బాబర్ ఆజమ్ వరుసగా విఫలమవుతున్నాడు. ఆసియా కప్ 2023 టోర్నీలో నేపాల్‌పై 151 పరుగులు చేసి అదరగొట్టిన బాబర్ ఆజమ్, ఆ తర్వాత ఐదు మ్యాచుల్లో హాఫ్ సెంచరీ మార్కు కూడా అందుకోలేకపోయాడు..

Shubman Gill-Babar Azam-Virat Kohli

వరుసగా విఫలం అవుతున్నా అదృష్టం కలిసి రావడంతో నెం.1 వన్డే బ్యాటర్ ర్యాంకుని కాపాడుకోగలిగాడు బాబర్ ఆజమ్. తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజమ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు..

Babar Azam

శుబ్‌మన్ గిల్ 830 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా బాబర్ ఆజమ్ 835 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో మూడో వన్డేలో శుబ్‌మన్ గిల్‌కి రెస్ట్ ఇచ్చింది టీమిండియా మేనేజ్‌మెంట్..

Latest Videos


ఆ మ్యాచ్‌లో ఆడి శుబ్‌మన్ గిల్ 30+ స్కోరు చేసినా, రెండు వారాల క్రితమే నెం.1 వన్డే బ్యాటర్‌గా అయ్యేవాడు. బాబర్ ఆజమ్ వరుసగా విఫలం అవుతున్నా డెంగ్యూ బారిన పడిన శుబ్‌మన్ గిల్, వరల్డ్ కప్‌లో మొదటి రెండు మ్యాచుల్లో బరిలో దిగలేదు.

Babar Azam

శుబ్‌మన్ గిల్ గైర్హజరీ, బాబర్ ఆజమ్‌కి బాగా కలిసి వచ్చింది. శుబ్‌మన్ గిల్ పూర్తిగా కోలుకుని, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడతాడని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే అక్టోబర్ 14న జరిగే ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లో ఈ ఇద్దరి పర్ఫామెన్స్.. వచ్చే వారం నెం.1 వన్డే బ్యాటర్‌ని డిసైడ్ చేయనుంది..

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 85 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఓ ర్యాంకు మెరుగుపర్చుకుని నెం.7లోకి వచ్చాడు. డకౌట్ అయిన రోహిత్ శర్మ ఓ ర్యాంకు దిగజారి, టాప్ 11లోకి పడిపోయాడు.. 97 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, 2 ర్యాంకులు ఎగబాకి 19వ స్థానంలో నిలిచాడు..
 

KL Rahul

జోష్ హజల్‌వుడ్, టీమిండియాపై ఇచ్చిన పర్ఫామెన్స్‌తో నెం.1 వన్డే బ్యాటర్‌గా నిలవగా మహ్మద్ సిరాజ్ రెండో స్థానానికి పడిపోయాడు. కుల్దీప్ యాదవ్, టాప్ 8లో కొనసాగుతున్నాడు.. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్ధిక్ పాండ్యా నెం.7లో ఉన్నాడు.. 

click me!