బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందే ఫైనల్ డేట్ ఫిక్స్... ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఎప్పుడంటే...

First Published Feb 8, 2023, 3:56 PM IST

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి బీభత్సమైన క్రేజ్ వచ్చింది. నాగ్‌పూర్‌లో జరిగే తొలి టెస్టుకి 40 వేలకు పైగా టికెట్లు అమ్ముడైపోయాయి. ఈ సిరీస్ ఫలితం ఐసీసీ నెం.1 టెస్టు టీమ్‌ని డిసైడ్ చేయనుంది. అలాగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే టీమ్స్‌పై కూడా ఓ క్లారిటీ రానుంది...
 

Image credit: Getty

లండన్‌లో ఓవల్ స్టేడియంలో జూన్ 7 నుంచి 11 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వర్షం కారణంగా ఓవర్లు రద్దయితే జూన్ 12న రిజర్వు డేగా ప్రకటించింది ఐసీసీ...

ఐపీఎల్ 2023 ఫైనల్ ముగిసిన తర్వాత వారం రోజుల గ్యాప్‌లో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిఫ్ ఫైనల్ జరగనుంది. దీంతో ఆస్ట్రేలియా కీ ప్లేయర్లు, ఐపీఎల్‌కి పూర్తిగా అందుబాటులో ఉండడం అనుమానమే..

డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగిన వారం రోజులకు ముందు యాషెస్ సిరీస్ ఆడనుంది ఆస్ట్రేలియా. జూన్ 16 నుంచి యాషెస్ సిరీస్ 2023 కోసం ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది ఆసీస్ జట్టు. గత ఏడాది స్వదేశంలో ఇంగ్లాండ్‌ని 4-0 తేడాతో ఓడించి యాషెస్ గెలిచింది ఆస్ట్రేలియా.. ఈ సారి రివెంజ్ తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది ఇంగ్లాండ్.. 

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021 ఫైనల్ కూడా 6 రోజుల పాటు సాగింది. వర్షం కారణంగా దాదాపు రెండు రోజుల ఆట రద్దు అయ్యింది. ఆరో రోజున వాతావరణం సహకరించడంతో న్యూజిలాండ్ టైటిల్ గెలిచేసింది.. 
 

ప్రస్తుతం 15 టెస్టులు ఆడి 10 విజయాలతో 75.56 విన్నింగ్ పర్సెంటేజ్‌తో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది ఆస్ట్రేలియా... ఆసీస్ 99.9 శాతం డబ్ల్యూటీసీ ఫైనల్‌కి అర్హత సాధించినట్టే... అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా 4-0 తేడాతో ఓడిపోతే మాత్రం సీన్ మారిపోద్ది...
 

14 టెస్టులు ఆడి 8 విజయాలు అందుకున్న టీమిండియా, 58.93 శాతం విజయాలతో రెండో స్థానంలో ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కనీసం 2 విజయాలు అందుకున్నా, ఆస్ట్రేలియాతో కలిసి ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది భారత జట్టు...

మూడో స్థానంలో ఉన్న శ్రీలంక, న్యూజిలాండ్‌తో 2 టెస్టులు ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఓడిపోయి నాలుగో స్థానానికి పడిపోయిన సౌతాఫ్రికా, వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఒకవేళ టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టైటిల్‌ని 2-0, 3-0 తేడాతో గెలిస్తే... శ్రీలంక, సౌతాఫ్రికాలకు ఛాన్స్ ఉండదు. ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఆడతాయి..

click me!