రిషబ్ పంత్‌ని ఇంటికెళ్లి కొట్టాలని ఉంది! అతని వల్ల టీమ్ అంతా పాడైపోయింది... - కపిల్ దేవ్...

First Published Feb 8, 2023, 3:03 PM IST

టీమిండియాకి మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్. అయితే ఈ మధ్య కపిల్ దేవ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఫామ్‌లోని విరాట్ కోహ్లీని టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీ ఆడించకూడదని వ్యాఖ్యానించి, వార్తల్లో నిలిచిన కపిల్ దేవ్, ఇప్పుడు రిషబ్ పంత్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు...

గత ఏడాది చివర్లో రాష్ డ్రైవింగ్ కారణంగా కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్, క్రికెట్‌కి దూరమయ్యాడు. 2020-21 సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రిషబ్ పంత్ లేకుండా 2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బరిలో దిగుతోంది భారత జట్టు...

Kapil Dev-Rishabh Pant

‘రిషబ్ పంత్ అంటే నాకు ఎంతో ప్రేమ. కానీ ఇప్పుడు అతని ఇంటికి వెళ్లి, చెంప పగలకొట్టాలని ఉంది. అతను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కోలుకుని జట్టులోకి రావాలి. ఎందుకంటే అతని యాక్సిడెంట్ కారణంగా టీమ్ అంతా చెడిపోయింది...

రిషబ్ పంత్‌‌ని ఎంతో ప్రేమిస్తా. కానీ ఇప్పుడు అతనిపై నాకు పీకల దాకా కోపం ఉంది. ఎందుకు ఈకాలం కుర్రాళ్లు ఇలాంటి పిచ్చి పనులు చేసి కెరీర్ నాశనం చేసుకుంటారు. అతను ఒక్కడూ ఉండి ఉంటే ఆస్ట్రేలియాకి గట్టి సమాధానం చెప్పేవాడు...

రిషబ్ పంత్‌ని ప్రపంచమంతా ప్రేమిస్తోంది. అతను త్వరగా కోలుకుని, క్రికెట్ ఆడాలని ఆకాంక్షిస్తోంది. ఇంతమంది ప్రేమను పొందడం ఎంతో అదృష్టం. అయితే పిల్లలు తప్పుచేస్తే కొట్టాల్సి బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంటుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు కపిల్ దేవ్...

రిషబ్ పంత్ లేకుండా టెస్టు సిరీస్ ఆడడం టీమిండియాకి గట్టి ఎదురుదెబ్బే. రిషబ్ పంత్ స్థానంలో ఇషాన్ కిషన్, కెఎస్ భరత్‌లను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసింది మేనేజ్‌మెంట్. 

 అయితే ఇప్పటిదాకా టెస్టు ఆరంగ్రేటం చేయని ఈ ఇద్దరూ, ఐసీసీ నెం.1 టెస్టు టీమ్‌ ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో రిషబ్ పంత్ లేని లోటు తెలియకుండా చేయగలరా? అంటే అది ఇప్పట్లో అయ్యే పని కాదు... 

click me!