15 మందినే భరిస్తాం, మిగిలినవాళ్లు మీ ఇష్టం... టీ20 వరల్డ్‌కప్‌పై ఐసీసీ ఆంక్షలు...

First Published Aug 13, 2021, 8:36 PM IST

టీ20 వరల్డ్‌కప్‌ 2021కి ముహుర్తం ఖరారైంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ జరిగే టీ20 వరల్డ్‌కప్ 2021 సంబంధించి కొన్ని ఆంక్షలను విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)... 

యూఏఈ వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ కోసం ప్రతీ జట్టు నుంచి 15 మంది క్రికెటర్లు, 8 మంది సహాయక సిబ్బందికి మాత్రమే అనుమతిస్తుంది ఐసీసీ... 

15 మంది కంటే ఎక్కువ మంది క్రికెటర్లను యూఏఈ తీసుకెళ్లాలని ఏ జట్టు అయినా భావిస్తే.. వారికయ్యే ఖర్చులను సొంత దేశాల బోర్డులే భరించాల్సి ఉంటుంది...

Latest Videos


‘కరోనా నిబంధనలు, బయో సెక్యూలర్ బబుల్ కారణంగా టీ20 వరల్డ్‌కప్‌ 2021 నిర్వహణకు భారీగా ఖర్చు అవుతోంది. అందుకే అదనపు ప్లేయర్ల కోసం అయ్యే ఖర్చులను సొంత బోర్డులే భరించాల్సి ఉంటుందని ఐసీసీ తెలిపింది...’ అంటూ ఓ పీసీబీ అధికారి తెలియచేశారు...

2016 తర్వాత టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహణ సాధ్యం కాలేదు. 2020లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టోర్నీ కూడా కరోనా కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది....

ఈ ఏడాది భారత్ వేదికగా జరగాల్సిన పొట్టి వరల్డ్‌కప్‌ను కరోనా కేసుల కారణంగా యూఏఈ, ఓమన్ వేదికగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ..

అలాగే సెప్టెంబర్ 20లోగా ప్రతీ జట్టూ, టోర్నీలో పాల్గొనే తుది 15 మంది సభ్యులను ప్రకటించాల్సి ఉంటుంది. వీరికి యూఏఈలో క్వారంటైన్ ఏర్పాట్లు చేయబడతాయి...

టీ20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు యూఏఈలో ఐదు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఈ క్వారంటైన్ గడువు ముగిసేలోపు జట్టులో మార్పులు కావాలంటే చేసుకునే అవకాశం బోర్డులకు ఉంటుంది...

click me!