ఎరుపు రంగు క్యాపులతో బరిలో దిగిన టీమిండియా, ఇంగ్లాండ్... ఆమెకు నివాళిగా...

First Published Aug 13, 2021, 7:43 PM IST

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజున ఇరు జట్ల ఆటగాళ్ల ఎరుపు రంగు క్యాపులను ధరించి ఉండడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇరు జట్ల ప్లేయర్లు మాత్రమే కాకుండా స్టేడియానికి వచ్చిన చాలామంది అభిమానులు కూడా ఇలాంటి క్యాపులే ధరించారు. దీనికి కారణం ఏంటంటే...

రూత్ స్ట్రాస్ క్యాన్సర్ ఫౌండేషన్‌ చేపట్టిన స్వచ్ఛంధ కార్యక్రమానికి సపోర్ట్ ఇచ్చేందుకు భారత క్రికెటర్లు ఇలా రెడ్ క్యాప్స్ ధరించి, రెండో టెస్టు రెండో రోజున బరిలో దిగారు...

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్, 2018లో లంగ్ క్యాన్సర్‌తో పోరాడి ప్రాణాలు విడిచిన తన భార్య రూత్ స్ట్రాస్ జ్ఞాపకంగా ఈ ఫౌండేషన్‌ను స్థాపించాడు...

ఆండ్రూ స్ట్రాస్‌తో పాటు ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ భార్య జాన్ బెస్ట్ క్యాన్సర్‌తో ప్రాణాలు విడిచింది. ఆమె జ్ఞాపకంగా మెక్‌గ్రాత్, ‘పింక్ డే’ పేరుతో బెస్ట్ క్యాన్సర్‌తో బాధపడేవారికి సాయం చేస్తున్నాడు. మెక్‌గ్రాత్‌ని మార్గదర్శకంగా తీసుకున్న ఆండ్రూ స్ట్రాస్... ఈ రెడ్ క్యాప్ మూమెంట్‌ను తీసుకొచ్చాడు...

పొగ తాగే అలవాటు లేకపోయినా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారిన పడేవారికి, వారి కుటుంబాలకి అవసరమైన ఆర్థిక సాయం చేసేందుకు ఈ రూత్ స్ట్రాస్ క్యాన్సర్ ఫౌండేషన్ పనిచేస్తుంది...

ఇందులో భాగంగా లార్డ్స్ టెస్టులో రెండో రోజును ‘రెడ్ ఫర్ రూత్’ డే కార్యక్రమం చేపట్టారు. ప్లేయర్లతో పాటు బ్రాడ్‌కాస్టర్లు, స్పోర్ట్స్ యాంకర్లు, ప్రెజెంటర్లు ఎరుపు రంగు దుస్తుల్లో కనిపించారు... 

అలాగే నేడు టీమిండియా ధరించిన జెర్సీలను రూత్ ఫౌండేషన్‌కి విరాళంగా ఇవ్వనున్నారు. వీటిని వేలం వేసి వచ్చిన డబ్బుతో క్యాన్సర్ రోగులకు అవసరమైన చికిత్స అందిస్తుంది రూల్ స్ట్రాస్ క్యాన్సర్ ఫౌండేషన్...

click me!