నేను మంచి కోచ్‌గా మారగలను, కానీ ఆ అవకాశం ఇవ్వరు... బీసీసీఐపై యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్...

Published : Jul 11, 2023, 01:12 PM IST

2011 వన్డే వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించి, ఆ తర్వాత టీమ్‌లో చోటు దొరక్క... నిరాశగా రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్లలో యువరాజ్ సింగ్ ఒకడు. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ మాదిరిగానే టీమ్‌లో ప్లేస్ కోసం ఏళ్ల పాటు ఎదురుచూసి రిటైర్ అయ్యాడు యువీ..  

PREV
18
నేను మంచి కోచ్‌గా మారగలను, కానీ ఆ అవకాశం ఇవ్వరు... బీసీసీఐపై యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్...
Yuvraj Singh

2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన యువరాజ్ సింగ్, ఆ టోర్నీలో 362 పరుగులు చేసి బ్యాటింగ్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌తో (380 పరుగులు) పోటీపడ్డాడు... 2011 ప్రపంచ కప్‌లో అత్యధిక యావరేజ్ కలిగిన భారత బ్యాటర్ యువీయే..

28

కుమార సంగర్కర 8 ఇన్నింగ్స్‌లో 93 యావరేజ్‌తో 465 పరుగులు చేస్తే, యువరాజ్ సింగ్ 8 ఇన్నింగ్స్‌లో 90.50 యావరేజ్‌తో 362 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సార్లు నాటౌట్‌గా నిలిచాడు యువీ. 

38

అలాగే బౌలింగ్‌లో 15 వికెట్లు తీసి ముత్తయ్య మురళీధరన్, బ్రెట్‌ లీ, లసిత్ మలింగ, డేల్ స్టెయిన్ వంటి దిగ్గజ బౌలర్ల కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు.. అయితే ఫైనల్‌లో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ తీసుకోవడంతో యువరాజ్ సింగ్‌కి దక్కాల్సినంత క్రెడిట్ దక్కలేదన్నది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం..

48
Yuvraj Singh

కెరీర్ పీక్స్‌‌లో ఉన్నప్పుడు ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడిన యువరాజ్ సింగ్, దానితో పోరాడి, పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి టీమ్‌లోకి వచ్చాడు. క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన యువీ, బీసీసీఐ రాజకీయాల్లో మాత్రం ఓడిపోయాడు.. 

58
Image Credit: Getty Images

రిటైర్మెంట్ తర్వాత గ్లోబల్ టీ20 కెనడా, అబుదాబీ టీ10 వంటి విదేశీ లీగుల్లో ఆడిన యువరాజ్ సింగ్, ఒకానొక దశలో రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని భావించాడు. అయితే విదేశీ లీగుల్లో ఆడడంతో యువీ కమ్‌బ్యాక్‌కి బీసీసీఐ ఒప్పుకోలేదు..

68
Image Credit: Getty Images

‘అవును, నేను టీమిండియాకి మంచి కోచ్‌గా మారగలను. ఆ నమ్మకం నాకుంది. అయితే దానికి నేను బీసీసీఐ సిస్టమ్‌లో ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఆ అవకాశం వస్తుందన్న నమ్మకం ఏ మాత్రం లేదు. నేను చేస్తానని చెప్పినా ఆ అవకాశం ఇవ్వరు..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్..

78
Image Credit: Getty Images

ప్రస్తుతం టీమిండియాలో ఫ్యూచర్ స్టార్‌గా వెలుగొందుతున్న శుబ్‌మన్ గిల్‌కి పర్సనల్ కోచ్‌గా ఉన్న యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్లేయర్లను కెరీర్ ఆరంభంలో ప్రొత్సహించి.. వారికి మెంటర్‌గా వ్యవహరించాడు.

88

ఐపీఎల్‌లో కొన్ని ఫ్రాంఛైజీలు, కోచ్‌గా రావాల్సిందిగా యువరాజ్ సింగ్‌ని సంప్రదించాయి. అయితే ఆ టైమ్‌లో ఫుల్ టైం కోచ్‌గా వ్యవహరించేందుకు తన దగ్గర టైం లేదని కామెంట్ చేశాడు యువీ...

click me!

Recommended Stories