నాకైతే టీమిండియా, వరల్డ్ కప్‌ గెలుస్తుందన్న నమ్మకం లేదు! యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్...

Published : Jul 11, 2023, 12:21 PM IST

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ రోహిత్ శర్మ. అయితే టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో మునుపటి ఫైర్ కనిపించడం లేదు. ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ రోహిత్ బ్యాటు నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శనలు రాలేదు..

PREV
17
నాకైతే టీమిండియా, వరల్డ్ కప్‌ గెలుస్తుందన్న నమ్మకం లేదు! యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్...

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, బేస్ ప్రైజ్ బౌలర్లతో నిండిన టీమ్‌ని ఈసారి ప్లేఆఫ్స్‌కి తీసుకురాగలిగాడు. గత సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్, ఈసారి రెండో క్వాలిఫైయర్ ఆడింది..

27

రోహిత్ శర్మ కెప్టెన్సీలో స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడనుంది భారత జట్టు. 2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత 12 ఏళ్లకు స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కావడంతో ఈసారి టీమిండియాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రోహిత్ సేన, ఈసారి కూడా వరల్డ్ కప్ గెలుస్తుందనే నమ్మకం తనకు లేదంటున్నాడు యువరాజ్ సింగ్..

37
Yuvraj Singh

‘నిజం చెప్పాలంటే ఈసారి టీమిండియా, వన్డే వరల్డ్ కప్ గెలుస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ ఇలా చాలామంది కీ ప్లేయర్లు గాయాలతో బాధపడుతున్నారు. మిడిల్ ఆర్డర్‌లో సరైన ప్లేయర్లు కనిపించడం లేదు..

47

స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ కూడా గెలవకపోతే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అయితే నిజాలు ఒప్పుకోక తప్పదు. కెప్టెన్‌ రోహిత్ శర్మలో టాలెంట్ చాలా ఉంది. అతను కొన్నాళ్లుగా ఫామ్‌లో లేకపోయినా వరల్డ్ కప్‌లో అది పెద్ద సమస్య కాదు..

57

ఎందుకంటే ఐపీఎల్ 2019 సీజన్‌లో కూడా రోహిత్ ఫెయిల్ అయ్యాడు, అయితే వన్డే వరల్డ్ కప్ 2019లో 5 సెంచరీలు బాదాడు. సరైన టీమ్ కాంబినేషన్ దొరకడమే టీమిండియాకి కష్టమైన విషయం. కనీసం 20 మంది ప్లేయర్లను వరల్డ్ కప్‌కి సిద్ధం చేయాలి..

67

టాపార్డర్‌లో శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉండడంతో పటిష్టంగా ఉంది. అయితే మిడిల్ ఆర్డర్‌లో 4, 5 స్థానాలు చాలా కీలకం. రిషబ్ పంత్ కోలుకుంటే ఈ పొజిషన్‌లలో ఆడేవాడు. ఇప్పుడు నాలుగో స్థానంలో సరైన బ్యాటర్‌ని కనిపెట్టడం టీమిండియాకి చాలా పెద్ద టాస్క్..

77
Rinku Singh

రింకూ సింగ్ చాలా బాగా ఆడుతున్నాడు. అతను లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో భాగస్వామ్యం నమోదు చేయగలడు. వరల్డ్ కప్ గెలవాలంటే రింకూ సింగ్‌కి అవకాశం ఇచ్చి, తగినన్ని మ్యాచులు ఆడించాలి.. ’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. 

click me!

Recommended Stories