నేను 5 వికెట్లు తీశా! రెండు క్యాచులు డ్రాప్ చేసిన ధోనీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు... - పాక్ మాజీ బౌలర్

First Published Jul 2, 2023, 11:44 AM IST

2023 వన్డే వరల్డ్ కప్ కోసం ఇండియాకి రాబోతోంది పాకిస్తాన్. 2016 టీ20 వరల్డ్ కప్ తర్వాత పాక్ క్రికెట్ టీమ్, ఇండియాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. 2013లో చివరిసారిగా భారత్‌లో పర్యటించి, ద్వైపాక్షిక సిరీస్ ఆడింది పాకిస్తాన్...
 

2013 ఇండియా పర్యటనలో రెండు టీ20 మ్యాచులు, మూడు వన్డేలు ఆడిన పాకిస్తాన్.. టీ20 సిరీస్‌ని 1-1 తేడాతో సమం చేసుకోగా వన్డే సిరీస్‌ని 2-1 తేడాతో సొంతం చేసుకుంది. మొదటి రెండు వన్డేల్లో ఓడిన ధోనీ సేన, ఢిల్లీలో జరిగిన మూడో వన్డేలో  10 పరుగుల తేడాతో గెలిచి పరువు కాపాడుకుంది..

Dhoni Bating

తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా, 43.4 ఓవర్లలో 167 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ధోనీ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా సురేష్ రైనా 31, యువరాజ్ సింగ్ 23, రవీంద్ర జడేజా 27, గౌతమ్ గంభీర్ 15 పరుగులు చేశారు.. 

Latest Videos


పాక్ మాజీ స్పిన్నర్ సయిద్ అజ్మల్ 9.4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 24 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి, టీమిండియా పతనానికి కారణమయ్యాడు. అయితే ఈ లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 48.5 ఓవర్లలో 157 పరుగులకి ఆలౌట్ అయ్యింది..

భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ 3 వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్, అశ్విన్ రెండేసి వికెట్లు తీశారు. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజాలకు చెరో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో మాహీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కడం అన్యాయం అంటున్నాడు పాక్ మాజీ స్పిన్నర్ సయిద్ అజ్మల్..

Dhoni Batting

‘2013లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో నా దురదృష్టం నన్ను వెంటాడింది. ఆ సిరీస్‌లో నేను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదటి రెండు మ్యాచులు మేం గెలిచాం. మూడో వన్డేలో వారిని 170లోపే ఆలౌట్ చేసేశాం...

లక్ష్యఛేదనలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 113 పరుగులు చేశాం,అయినా గెలవలేకపోయాం. ఆ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో ధోనీ 18 పరుగులేమో (36 పరుగులు) చేశాడు, రెండు ఈజీ క్యాచులను డ్రాప్ కూడా చేశాడు..

అయినా అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. అది సరైన నిర్ణయం కాదు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే ఆ మ్యాచ్‌లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన ప్లేయర్‌కి దక్కాలి. అంటే 5 వికెట్లు తీసిన నాకు రావాలి. కానీ ఇండియా గెలిచిందని ధోనీకి ఇచ్చుకున్నారు... ఇది చాలా అన్యాయం’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ స్పిన్నర్ సయిద్ అజ్మల్..

అదే వన్డే సిరీస్‌లో మొదటి వన్డేలో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో గెలిచినా, అజేయంగా 113 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

nasir jamshed

ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ నసీర్ జంషెడ్ 101 పరుగులు చేసినా టీమిండియా తరుపున ఒంటరి పోరాటం చేసినందుకు ధోనీకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఇచ్చారు.. రెండో వన్డేలో సెంచరీ చేసిన నసీర్ జంషెడ్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ కూడా దక్కించుకున్నాడు. 

click me!