ద్రావిడ్ భాయ్ చెప్పిన మాటకు నా షర్ట్ విప్పి చెత్తకుప్పలో పడేశా... మాజీ క్రికెటర్ సురేశ్ రైనా...

Published : Jun 14, 2021, 01:26 PM IST

భారత జట్టులో ఎంతో క్రికెటర్లు వచ్చారు, వెళ్లారు అయితే భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్‌కి ఉన్న ఫాలోయింగ్ వేరు. క్లీన్ క్రికెటర్‌గా, మోస్ట్ లవింగ్ పర్సన్‌గా ఎంతో విధేయత కలిగిన సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నాడు రాహుల్ ద్రావిడ్. ద్రావిడ్ భాయ్‌తో తనకి ఎదురైన ఓ అనుభవాన్ని తాజాగా బయటపెట్టాడు సురేశ్ రైనా...

PREV
113
ద్రావిడ్ భాయ్ చెప్పిన మాటకు నా షర్ట్ విప్పి చెత్తకుప్పలో పడేశా... మాజీ క్రికెటర్ సురేశ్ రైనా...

భారత జట్టు ప్రస్తుత విజయాలకు క్రెడిట్ ఎక్కువగా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, సౌరవ్ గంగూలీలకి దక్కుతాయని చెబుతారు. అయితే మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌కి కూడా క్రెడిట్ ఉంటుందని అంటున్నాడు సురేశ్ రైనా...

213

‘రాహుల్ భాయ్ క్రికెట్ జట్టును తన కుటుంబంగా భావిస్తాడు. తన జూనియర్ ప్లేయర్ల హక్కుల కోసం ఆయన ఎప్పటినుంచో పోరాడుతూనే ఉన్నారు. ఆయన చేసిన కృషికి ఫలితం దక్కుతోంది...

313

ప్రస్తుతం భారత జట్టు ఉన్న స్థితికి, వచ్చే పదేళ్లల్లో టీమిండియా పర్ఫామెన్స్‌కి ఆయనే కారణం. మహేంద్ర సింగ్ ధోనీ, ఇర్ఫాన్ పఠాన్, పియూష్ చావ్లా, దినేశ్ కార్తీక్, మునాఫ్ పటేల్, శ్రీశాంత్‌తో పాటు నేను భారత జట్టుకి ఆడడానికి కూడా రాహుల్ భాయే కారణం...

413

ఆటగాడు రాణించాలంటే అతనికి ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రైయినింగ్ కంటే ఎక్కువగా సైకాలాజికల్ బూస్ట్ కావాలి. అలాంటి మానసిక ధైర్యాన్ని రాహుల్ భాయ్ అందించేవాడు...

513

కుటుంబానికి దూరంగా కొన్ని నెలల పాటు జట్టుతో ఉండే ఆటగాళ్లకు ఆయనిచ్చే మార్గదర్శకాలు, జీవితాన్ని చూసే కోణాన్ని మార్చేస్తాయి. రాహుల్ భాయ్ కెప్టెన్సీలో ఆడడం నా అదృష్టం...

613

గత 10, 15 ఏళ్లుగా భారత జట్టు పర్ఫామెన్స్‌లో ఎక్కువ క్రెడిట్ ధోనీ లేదా గంగూలీకి ఇస్తారు. కానీ భారత క్రికెట్ టీమ్‌ను ముందుకు తీసుకెళ్లినవారిలో రాహుల్ భాయ్ పేరు కూడా ఉండాలి...

713

ఎందుకంటే తన జట్టులో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని రాహుల్ భాయ్ సెలక్టర్లతో గొడవపడడం నేను కళ్లారా చూశా. అదీకాకుండా మమ్మల్ని ఐపీఎల్ కంటే ఎక్కువగా రంజీ ట్రోఫీలో ఆడడానికి ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ భాయ్ చెబుతుండేవారు...

813

చెప్పడమే కాదు, ఆయన కూడా భారత జట్టుకి ఆడుతున్న సమయంలోనూ రంజీల్లో పాల్గొనేవాడు. కెప్టెన్‌గా వ్యవహారంచిన సమయంలో రాహుల్ భాయ్ చాలా సీరియస్‌గా ఉండేవాడు. నిజం చెప్పాలంటే నేను రాహుల్ భాయ్‌కి భయపడినంత భారత జట్టులో ఏ క్రికెటర్‌కీ భయపడలేదు...

913

మ్యాచ్‌కి ముందు బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ఆయన చాలా సీరియస్‌గా ఆలోచిస్తూ కనిపించేవాళ్లు. చాలాసార్లు రాహుల్ భాయ్ దగ్గరికి వెళ్లి ‘రిలాక్స్ అవ్వండి సార్’ అని చెప్పాలనుకున్నా. కానీ ఆయన మ్యాచ్‌కి అలా ప్రిపేర్ అవుతారని అర్థం చేసుకున్నా..

1013

ఎందుకంటే భారత జట్టుకి ఆడడాన్ని రాహుల్ భాయ్ గౌరవంగా భావించేవారు. ఓసారి వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో ట్రై సిరీస్ ఆడేందుకు మలేషియా వెళ్లాం...

1113

అక్కడ నేను ఓ షాపింగ్ మాల్‌కి వెళ్లా. అక్కడ ఓ కొత్త టీ షర్ట్ నాకు బాగా నచ్చింది. వెంటనే దాన్ని కొని, వేసుకున్నా. దానిపైన ‘ఎఫ్‌సీయూకే’ అని ఇంగ్లీష్‌లో రాసి ఉండడం రాహుల్ భాయ్ చూశాడు...

1213

ఆయన నన్ను పిలిచి... ‘నువ్వు ఏం వేసుకున్నావో తెలుసా. నువ్వు ఓ భారత క్రికెటర్‌వి. ఇలా రాసి ఉన్న టీ షర్టు వేసుకుని పబ్లిక్‌లో తిరుగుతావా...’ అంటూ అడిగారు. ఆయన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేకపోయింది...

1313

ఏదో చెప్పాలనుకున్నా కానీ, ఆయన చెప్పిన మాటలు అర్థం చేసుకున్నాక... వెంటనే వెళ్లి రెస్టు రూమ్‌లో షర్టు మార్చుకున్నా. ఆ టీ షర్టును చెత్త బుట్టలో పడేశా...’ అంటూ చెప్పుకొచ్చాడు సురేశ్ రైనా...

click me!

Recommended Stories