దేశం విడిచి వెళ్లినందుకు బాధగా లేదు, అందుకే క్రికెట్ ఆడుతున్నా... ఉన్ముక్త్ చంద్ కామెంట్స్...

First Published Nov 15, 2021, 8:20 PM IST

అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి, క్రేజ్ తెచ్చుకోవడం వేరు, అండర్-19 క్రికెట్ నుంచి బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుని, భారీ అంచనాలను మోయడం వేరు. అలాంటి పొజిషన్‌ని ఎదుర్కొన్న వాడే 2012 అండర్19 వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్...

2008లో అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన విరాట్ కోహ్లీ, టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టడంతో 2012లో అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌కి కూడా బీభత్సమైన క్రేజ్ వచ్చింది. అయితే అనుకోకుండా వచ్చిన ఆ  నేమ్, ఫేమ్ వచ్చినంత ఈజీగా ఉన్ముక్త్ చంద్‌కి సరైన అవకాశాలు దక్కలేదు, దక్కిన అవకాశాలను చక్కగా వినియోగించుకోలేకపోయాడు.

9 ఏళ్లపాటు టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న ఉన్ముక్త్ చంద్, టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించి, యూఎస్ తరుపున క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. మైనర్ లీగ్ క్రికెట్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో మూడు బంతులు ఎదుర్కొని డకౌట్ అయిన ఉన్ముక్త్ చంద్, ఆ తర్వాత కుదురుకుని తన సత్తా నిరూపించుకున్నాడు. 

9 ఏళ్లపాటు టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న ఉన్ముక్త్ చంద్, భారత జట్టుకి రిటైర్మెంట్ ప్రకటించి, యూఎస్ తరుపున క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. మైనర్ లీగ్ క్రికెట్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో మూడు బంతులు ఎదుర్కొని డకౌట్ అయిన ఉన్ముక్త్ చంద్, ఆ తర్వాత కుదురుకుని తన సత్తా నిరూపించుకున్నాడు. 

ఉన్ముక్త్ చంద్ ఆడిన సిలికాన్ వ్యాలీ స్ట్రైయికర్స్ జట్టు ‘మైనర్ క్రికెట్ లీగ్’ టైటిల్ గెలవగా, భారత మాజీ కెప్టెన్‌ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా ఎంపికయ్యాడు. వచ్చే ఏడాది మేజర్ లీగ్ క్రికెట్‌లో ఆడబోతున్నాడు ఉన్ముక్త్ చంద్..

‘నేను దేశం విడిచి వచ్చినందుకు బాధ పడడం లేదు. ఎందుకంటే దాదాపు రెండేళ్లుగా నేను ఢిల్లీ సెలక్టర్లతో మాట్లాడుతున్నా. నాకు అవకాశం ఇవ్వకుండా తిప్పించుకుంటూ, తీవ్ర అసహనానికి గురి చేశారు. దాంతో ఓ సీజన్‌లో ఉత్తరాఖండ్‌కి మారాను...

ఆ టైంలో గాయం కారణంగా సరిగా ఆడలేకపోయాను. చాలా నిరుత్సాహపడ్డాను, కృంగిపోయాను. ఆ సమయంలో యూఎస్‌ఏ క్రికెట్ నుంచి ఆఫర్ వచ్చింది. అందుకే కొత్తగా కెరీర్ మొదలెట్టేందుకు వచ్చిన అవకాశంగా భావించా...

ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆనందంగా ఉన్నా. త్వరలో బిగ్‌బాష్ లీగ్ ఆడబోతున్నా. యూఎస్‌ఏ క్రికెట్ లీగ్‌కి మరో రెండు నెలలు మాత్రమే ఉండడంతో వేరే టీ20 లీగ్స్‌ ఆడలేకపోతున్నా...

సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్తాన్ క్రికెటర్లతో కలిసి ఆడడం చాలా సంతోషంగా ఉంది. యూఎస్‌ఏ క్రికెట్ వేగంగా పెరుగుతోంది. యూఎస్‌ఏ జాతీయ జట్టు తరుపున ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు ఉన్ముక్త్ చంద్...

2012 అండర్‌-19 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 130 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 111 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ఉన్ముక్త్ చంద్... దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

2012 అండర్ 19 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత వచ్చిన క్రేజ్ కారణంగానే మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా, విరాట్ కోహ్లీలతో కలిసి పెప్సీ యాడ్‌లో కలిసి నటించాడు ఉన్ముక్త్ చంద్.... అండర్ 19 వరల్డ్‌కప్ జట్లకి సారథ్యం వహించిన మహ్మద కైఫ్, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, పృథ్వీషా వంటి వాళ్లు భారత జట్టులో అద్భుతంగా రాణిస్తే, ఉన్ముక్త్ చంద్‌కి టీమిండియా నుంచి పిలుపు కూడా రాలేదు...

click me!