IPL vs PSL: అబ్బే నేను అలా అన్లేదే... ఐపీఎల్ పై మాట మార్చిన పీసీబీ చైర్మన్

Published : Apr 04, 2022, 05:35 PM IST

Ramiz Raza Comments On IPL: బీసీసీఐ ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా మాట మార్చారు. 

PREV
18
IPL vs PSL: అబ్బే నేను అలా  అన్లేదే... ఐపీఎల్ పై  మాట మార్చిన పీసీబీ చైర్మన్

ఐపీఎల్ కంటే తమ  పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) గొప్పదని బీరాలకు  పోయిన పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజా మాట మార్చారు. అసలు తాను అలా అనలేదని చెప్పుకొచ్చారు. 

28

నెల రోజుల క్రితం పీఎస్ఎల్ కు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రమీజ్ రాజా... ‘మేము (పీఎస్ఎల్) కూడా ఐపీఎల్ మాదిరిగానే వేలం ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నాం. అయితే ఒకవేళ మేము ఆ ప్రక్రియను ప్రారంభిస్తే ఇక ఐపీఎల్ ఆడేవారు ఎవరూ ఉండరు. అందరూ పీఎస్ఎల్ కే మొగ్గు చూపుతారు..’అని చెప్పినట్టు గతంలో వార్తలు వెలువడ్డాయి. 

38

ఈ వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు నవ్వుకోవడమే గాక..  ఐపీఎల్ గురించి పక్కనబెట్టి  ముందు నీ దేశ క్రికెట్ పరిస్థితి గురించి చూస్కో.. అని రమీజ్ కు సూచించారు.  క్రికెట్ విశ్లేషకులు కూడా ఆయనపై విమర్శలకు దిగారు. 

48

దీంతో రమీజ్ రాజా మళ్లీ స్పందిస్తూ.. ‘అబ్బే నేనలా అన్లేదు. భారత (బీసీసీఐ) ఆర్థిక పరిస్థితితో ఎలా ఉందో మా బోర్డు ఆర్థిక స్థితి ఏంటో నాకు తెలుసు. 

58

అయితే మేము పీఎస్ఎల్  పరిదిని విస్తరించాలనుకుంటున్నాం. పీఎస్ఎల్ లో కూడా  వేలం ప్రక్రియను తీసుకురావాలనుకుంటున్నాం.  నా వ్యాఖ్యలను కొంతమంది తప్పుదోవ పట్టించారు...’అని  కవర్ చేసుకునే ప్రయత్నం  చేశారు. 

68

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ దృష్టంతా  నాలుగు దేశాల (ఇండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్) మీదే ఉందని, ఒకవేళ దానికి ఐసీసీ ఆమోదముద్ర వేస్తే తమకు అంతకుమించిన ఆనందమేముంటందని చెప్పుకొచ్చారు. 

78

ప్రతి యేటా సెప్టెంబర్-అక్టోబర్  మాసాల్లో పైన పేర్కొన్న నాలుగు దేశాలు తటస్థ వేదికలపై టీ20 సిరీస్ ఆడేలా  పీసీబీ ఓ ప్రతిపాదన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనపై సభ్యదేశాలు పెద్దగా ఆసక్తి చూపకున్నా  పాక్ మాత్రం పట్టుదలగా ఉంది. 

88

ఇందుకు సంబంధించి దుబాయ్ లో  ఈవారం ఐసీసీ పాలక మండలి సమావేశమై పాక్ ప్రతిపాదనపై చర్చించే అవకాశమున్నది. ఈ నాలుగు దేశాల్లో క్రికెట్ పట్ల ఉన్న క్రేజ్ దృష్ట్యా.. దానిని క్యాష్ చేసుకోవాలని పీసీబీ భావిస్తున్నది. మరి దీనిపై ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి  నెలకొన్నది. 

click me!

Recommended Stories