‘థ్యాంక్యూ బుమ్రా... వాడిని డకౌట్ చేశావ్...’ టీమిండియా బౌలర్‌కి కృతజ్ఞతలు తెలిపిన జార్వో...

Published : Sep 07, 2021, 01:07 PM IST

జార్వో 69... ఇప్పుడితనికి సోషల్ మీడియాలో మామూలు ఫాలోయింగ్ లేదు. ఇతను ప్లేయర్ కాదు, కనీసం బాల్ బాయ్ కూడా కాదు. మ్యాచులు జరుగుతున్నప్పుడు క్రీజులోకి దూసుకొచ్చి, బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. నాలుగు టెస్టుల్లో మూడు సార్లు మైదానంలో దూసుకొచ్చిన జార్వో, భారత బౌలర్ బుమ్రాకి థ్యాంక్స్ చెబుతూ పోస్టు చేశాడు...

PREV
17
‘థ్యాంక్యూ బుమ్రా... వాడిని డకౌట్ చేశావ్...’ టీమిండియా బౌలర్‌కి కృతజ్ఞతలు తెలిపిన జార్వో...

‘నేను జస్ప్రిత్ బుమ్రాకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే అతను, జానీ బెయిర్‌స్టోని సున్నాకే అవుట్ చేశాడు. ఈ జానీ బెయిర్ స్టో నన్ను ఆ రోజు తిట్టాడు...’ అంటూ పోస్టు చేశాడు జార్వో...

27

నాలుగో టెస్టులో మైదానంలోకి దూసుకొచ్చిన జార్వో, క్రీజులో ఉన్న బెయిర్‌స్టోని అమాంతం తోసేసినంత పనిచేశాడు. దీంతో బెయిర్ స్టో అతనిపై నోరుపారేసుకున్నాడు. అంతకుముందు రెండో టెస్టు సమయంలోనూ బెయిర్ స్టో, జార్వోని తిట్టడం కనిపించింది...

37

ఇంగ్లాండ్, ఇండియా సిరీస్‌లో జో రూట్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జేమ్స్ అండర్సన్ వంటి స్టార్ ప్లేయర్ల కంటే ఎక్కువగా పాపులర్ అయిన పేరు జార్వో. 69 నెంబర్ టీమిండియా జెర్సీ ధరించిన జార్వో... ఇప్పటికే ఈ సిరీస్‌లో మూడు సార్లు మైదానంలోకి దూసుకొచ్చి, ఆటకు అంతరాయం కలిగించాడు.

47

లార్డ్స్ టెస్టులో, హెడ్డింగ్‌లే టెస్టులో క్రీజులోకి దూసుకొచ్చి... ఆటకి అంతరాయం కలిగించిన డానియల్ జార్వీస్, ఉరఫ్ జార్వోను నాలుగో టెస్టులో మైదానంలో అడుగుపెట్టిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ సారి బ్యాట్స్‌మెన్‌గా, ఓ సారి బౌలర్‌గా... మరోసారి ఫీల్డర్‌గా క్రీజులోకి దూసుకొచ్చిన జార్వో సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు...

57

ఇండియాలో అయితే సెక్యూరిటీని దాటుకుని, ఒక్కసారి క్రీజులో అడుగుపెట్టాలంటేనే భయంతో జడుసుకుంటారు క్రికెట్ ఫ్యాన్స్. అలాంటిది ఇంగ్లాండ్‌లో సెక్యూరిటీ కళ్లుగప్పి మూడు సార్లు మైదానంలోకి వచ్చాడు జార్వో. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, స్టేడియాల్లో భద్రతా ఏర్పాట్లపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి...

67

ఈ వరుస సంఘటనలతో సెక్యూరిటీని తప్పించుకుని మైదానంలో వస్తున్న జార్వోను సీరియస్‌గా తీసుకున్న ఇంగ్లాండ్, అతన్ని అరెస్టు చేయడమే కాకుండా... క్రిమినల్ కేసు నమోదుచేశారు. విచారణ తర్వాత మళ్లీ స్టేడియంలో అడుగుపెట్టొందని గట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు...

77

అంతకుముందు లీడ్స్ టెస్టులో క్రీజులోకి వచ్చిన జార్వోపై హెడ్డింగ్‌లే స్టేడియంలోకి రాకుండా జీవిత కాలం నిషేధంతో పాటు భారీ జరిమానా విధించింది యార్క్‌షైర్ కౌంటీ క్లబ్..

click me!

Recommended Stories