టాస్‌కి 5 నిమిషాల ముందు చెప్పారు! హోటల్‌కి ఉరుక్కుంటూ వెళ్లి... కెఎల్ రాహుల్ కామెంట్..

First Published Sep 12, 2023, 3:45 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు, ఆల్‌రౌండ్ షోతో అదరొట్టి 228 పరుగుల భారీ తేడాతో విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 356 పరుగుల భారీ స్కోరు చేసింది...

KL Rahul

రోహిత్ శర్మ 56, శుబ్‌మన్ గిల్ 58 పరుగులు చేసి అవుట్ కాగా విరాట్ కోహ్లీ 122, కెఎల్ రాహుల్ 111 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కి 233 పరుగుల భారీ స్కోరు అందించారు..

Virat Kohli_KL Rahul

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ‌లో బౌండరీ ఆపేందుకు ప్రయత్నించి, గాయపడిన కెఎల్ రాహుల్, పాకిస్తాన్‌తో మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. 5 నెలల గ్యాప్ తర్వాత ఆడుతున్నా సెంచరీతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు రాహుల్..

Virat Kohli_KL Rahul

‘నేను, శ్రీలంకకి వచ్చి 2 రోజులు కూడా కాలేదు. కాబట్టి నేటి మ్యాచ్‌లో నాకు అవకాశం వస్తుందని అస్సలు అనుకోలేదు. డ్రింక్స్ బాయ్‌గా మాత్రమే ఉంటానని అనుకున్నా. అయితే టాస్ ఆరంభానికి 5 నిమిషాల ముందు రాహుల్ ద్రావిడ్ భాయ్.. నేను ఆడుతున్నానని చెప్పాడు..

నేను ఆడడం లేదని, నా కిట్ బ్యాగ్‌ని హోటల్‌లోనే వదిలేశా వచ్చా. మ్యాచ్ ఆరంభానికి ముందు మేనేజర్‌కి ఆడుతున్నానని చెప్పడంతో అతను పరుగెత్తుకుంటూ వెళ్లి తీసుకున్నాడు. నా కెరీర్‌లో ఇదో వింత సంఘటన..
 

విరాట్ కోహ్లీ తాను డబుల్స్, త్రిబుల్స్ తీయడమే కాదు, నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో ఉన్న ప్లేయర్లను పరుగెత్తేలా చేస్తాడు. సింగిల్ వచ్చేదగ్గర 2 పరుగులు రాబట్టేలా చూస్తాడు. కోహ్లీతో ఆడుతుంటే మన ఎనర్జీకి పరీక్ష పెట్టాల్సి వస్తుంది...’  అంటూ కామెంట్ చేశాడు కెఎల్ రాహుల్..

KL Rahul

శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పితో బాధపడుతూ టీమ్‌కి దూరం కావడంతో అతని ప్లేస్‌లో కెఎల్ రాహుల్‌ తుది జట్టులోకి వచ్చాడు. అయ్యర్ గాయం నుంచి కోలుకున్నా, రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక శ్రీలంకతో మ్యాచ్‌లో కూడా అతనికి రెస్ట్ ఇచ్చింది టీమ్ మేనేజ్‌మెంట్.. 

click me!