Virat Kohli
వర్షం కారణంగా సెప్టెంబర్ 10న 24.1 ఓవర్లు బ్యాటింగ్ చేసిన భారత జట్టు, రిజర్వు డే సెప్టెంబర్ 11న మిగిలిన 25.5 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్‌ని 32 ఓవర్లలో ఆలౌట్ చేసింది.
Naseem Shah of Pakistan
ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండానే సెప్టెంబర్ 12న శ్రీలంకతో తలబడుతోంది. అంటే వరుసగా 10, 11, 12 తేదీల్లో క్రికెట్ ఆడనుంది టీమిండియా. ఈ మ్యాచ్‌కి రిజర్వు డే లేదు కాబట్టి సరిపోయింది, లేదంటే సెప్టెంబర్ 13న కూడా మ్యాచ్ ఆడాల్సి వచ్చేది..
Virat Kohli
‘నా 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎప్పుడూ వరుసగా మూడు రోజులు వైట్ బాల్ మ్యాచ్‌లు ఆడలేదు. అయితే మేం ఎలాంటి ఛాలెంజ్‌నైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. నేను కచ్ఛితంగా ఈ మ్యాచ్ ఆడతానని చెప్పాను..
Virat Kohli
ఎందుకంటే వరుసగా ఐదు రోజుల పాటు టెస్టు మ్యాచ్ ఆడినప్పుడు, వరుసగా 2 లేదా 3 రోజులు వన్డే మ్యాచ్ ఆడడానికి ఇబ్బంది ఎందుకు ఉంటుంది. నేను 100 టెస్టులకు పైగా ఆడాను...
Virat Kohli_KL Rahul
ఓ మంచి ఇన్నింగ్స్ తర్వాత నెక్ట్స్ మ్యాచ్‌కి ఎలా ప్రిపేర్ కావాలో బాగా తెలుసు. గాయం నుంచి కోలుకుని ఆడుతున్నా కెఎల్ రాహుల్ చాలా చక్కని ఆరంభం దక్కించుకున్నాడు. అందుకే నేను స్ట్రైయిక్ రొటేట్ చేస్తూ అతనికి స్ట్రైయిక్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇచ్చాను..
నేను హాఫ్ సెంచరీ ఎప్పుడు చేశానో, సెంచరీ దగ్గరికి ఎప్పుడు వచ్చానో కూడా చూసుకోలేదు. సెంచరీ తర్వాత ఫ్రీగా షాట్స్ ఆడాలని నిర్ణయం తీసుకున్నా. నేను, కెఎల్ రాహుల్ ఎప్పుడూ కూడా ఫ్యాన్సీ షాట్స్ ఆడాలని అనుకోం...
Virat Kohli_KL Rahul
మా ఇద్దరి మధ్య మంచి భాగస్వామ్యం నమోదైంది. వరల్డ్ కప్ ముందు ఈ విజయం మా టీమ్‌లో మంచి జోష్ నింపుతుంది. వచ్చే నవంబర్‌కి నాకు 35 ఏళ్లు నిండుతున్నాయ్. కాబట్టి నా బాడీకి రెస్ట్ ఎలా ఇవ్వాలో కూడా నాకు తెలుసు..’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ..
94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 122 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, వన్డేల్లో 47వ సెంచరీ అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ కారణంగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన విరాట్ కోహ్లీ, ఆసియా కప్‌లో అత్యధిక ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచిన టీమిండియా ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు..