‘సచిన్... నీ వెంటే మేము...’ టెండూల్కర్‌కి అండగా నిలిచిన ఫ్యాన్స్...

First Published Feb 6, 2021, 3:41 PM IST

సచిన్... సచిన్... దశాబ్దం కిందట క్రికెట్ స్టేడియాల్లో మార్మోగిన నామస్మరణ ఇది... ఇండియాలో క్రికెట్‌కి ఇంతటి క్రేజ్ రావడానికి ఒకే ఒక్క కారణం సచిన్ టెండూల్కర్. ‘మాస్టర్ బ్లాస్టర్‌’గా, ‘క్రికెట్ గాడ్’గా కీర్తించబడిన సచిన్ టెండూల్కర్‌ను ఇప్పుడు ఓ వర్గం టార్గెట్ చేసింది. కారణం అమెరికన్ పాప్ సింగర్ రిహానా ట్వీట్‌కి సచిన్ టెండూల్కర్ అభ్యంతరం తెలపడమే. సచిన్ తన ట్వీట్‌లో రైతులకి మద్ధతుగా కానీ, కేంద్రానికి మద్ధతుగా కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

అంతర్గత విషయాల్లో బయటివాళ్ల జోక్యాన్ని సహించబోమనే ఉద్దేశంలో మాత్రమే ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్. అయితే ఈ ట్వీట్‌ ఓ వర్గాన్ని తీవ్రంగా రెచ్చిగొట్టినట్టైంది. కేంద్రానికి మద్ధతుగా సచిన్ ఈ ట్వీట్ చేశారంటూ మలయాళీలు సచిన్ టెండూల్కర్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ద్వేషాన్ని నింపుతున్నారు. సచిన్ ఎవరూ తెలియదంటూ ఏడేళ్ల క్రితం కామెంట్ చేసిన షరపోవాకి క్షమాపణలు చెప్పిన ఈ ఓవర్ యాక్షన్ కుర్రాల్లు... టెండూల్కర్ కులాన్ని కూడా సంబోధిస్తూ దూషిస్తున్నారు.
undefined
అయితే సచిన్ టెండూల్కర్ అభిమానులు మాత్రం ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన వెంటే ఉన్నామని సగర్వంగా ప్రకటించారు. ‘వీ స్టాండ్ విత్ సచిన్’, ‘ఐ స్టాండ్ విత్ సచిన్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. 24 ఏళ్ల క్రికెట్ కొనసాగించిన సచిన్ టెండూల్కర్,తన జీవితంలో దేశం కోసం చేసిన దాన్ని, ఒక్క ట్వీట్‌తో తీసిపారేయొద్దంటూ ఆయనకి సపోర్టు చేస్తున్నారు...
undefined
కొందరు మలయాళీ యువత, సచిన్ టెండూల్కర్ ఫోటోలకి నల్ల ఇంకు పూసి నిరసన వ్యక్తం చేశారు. ఇది రైతుల మీద ఉన్న ప్రేమో, సచిన్ మీద ఉన్న ద్వేషమో... లేక ట్వీట్ చేసిన పాప్ సింగర్ రిహానా మీద ఉన్న వీరాభిమానమో తెలియనవాళ్లు ఎవ్వరూ లేరంటూ ట్వీట్లు చేస్తున్నారు ‘క్రికెట్ గాడ్’ వీరాభిమానులు...
undefined
ఎన్ని కోట్లు ఇచ్చినా సిగరెట్, మద్యపానం వంటి బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహారించకూడదని నిర్ణయించుకున్న సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తిత్వాన్ని పూటకో మాట మార్చే ఈ నెటిజన్లు ప్రశ్నించగలరా... అంటూ నిలదీస్తున్నారు. అద్భుతంగా బ్యాటింగ్ చేసినప్పుడు మహేంద్ర సింగ్ ధోనీని ‘తలైవా’ అంటూ నెత్తిన బెట్టుకున్న అభిమానులు, ఆయన ఫెయిల్ అయినప్పుడు తీవ్రంగా దూషిస్తూ ట్వీట్లు చేసిన సంగతి మరిచిపోగలమా? అంటూ నిలదీస్తున్నారు.
undefined
సచిన్‌ను ద్వేషిస్తూ ట్వీట్లు చేస్తున్న వారిలో చాలామందికి నూతన వ్యవసాయం చట్టం గురించి కానీ, ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమం గురించి కానీ ఎలాంటి అవగాహన లేదు. రిహానా వేసిన ట్వీట్‌కి సచిన్ టెండూల్కర్ ఇచ్చిన రిప్లైని సరిగ్గా అర్థం చేసుకునే పరిణితి కూడా వీరిలో లేదు. కేవలం అవకాశం దొరికిందని, ప్రభుత్వంపై తమకున్న ఆవేశాన్ని చూపించాలని సోషల్ మీడియాలో షో చేస్తున్న చాలామంది ఉన్నారని ఆరోపిస్తున్నారు ‘మాస్టర్’ అభిమానులు.
undefined
click me!