అవన్నీ ఫేక్ ఫోటోలు, నేనెప్పుడు వాటిల్లో నటించలేదు... సచిన్ టెండూల్కర్ వివరణ...

Published : Feb 24, 2022, 02:23 PM IST

‘క్రికెట్ గాడ్’గా పిలవబడే సచిన్ టెండూల్కర్‌కి ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ వేరే లెవెల్. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని 8 ఏళ్లు దాటినా ఇప్పటికీ భారత్‌లో అత్యధిక ఫాలోయింగ్, పాపులారిటీ ఉన్న క్రికెటర్లలో టాప్ 3లో ఉన్నాడు సచిన్ టెండూల్కర్...

PREV
19
అవన్నీ ఫేక్ ఫోటోలు, నేనెప్పుడు వాటిల్లో నటించలేదు... సచిన్ టెండూల్కర్ వివరణ...

విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ తర్వాత భారత్‌లో అత్యంత పాపులారిటీ ఉన్న మూడో భారత క్రికెటర్‌గా నిలిచి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్...

29

అయితే సచిన్ టెండూల్కర్‌ను విమర్శించే వాళ్లు లేకపోలేదు. సచిన్ టెండూల్కర్‌కి ఉన్న గుడ్‌విల్‌ను పాడుచేయాలని విశ్వప్రయత్నాలు చేసిన వాళ్లు, చేస్తున్నవాళ్లు కోకొల్లలు...

39

తాజాగా కొందరు నెటిజన్లు, సోషల్ మీడియాలో భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, కాసినో ఆడుతున్నట్టుగా, దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు ఉన్న యాడ్ ఫోటోలను ప్రచారం చేయడం మొదలెట్టారు...

49

ఈ విషయం తెలుసుకున్న ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్విట్టర్ ద్వారా అభిమానులకు వివరణ ఇచ్చాడు...
 

59

‘నేను ఓ కాసినోకి అంబ్రాసిడర్‌గా చేస్తున్న కొన్ని మార్ఫ్‌డ్ ఫోటోలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో ప్రచారం జరుగుతున్నట్టు నా దృష్టికి వచ్చింది...

69

నేను నా జీవితంలో ఎప్పుడూ కూడా గ్యాంబ్లింగ్, టొబాకో (పొగ) లేదా అల్కహాల్‌లను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రచారం చేసింది లేదు...

79

నా ఫోటోలను వాడి జనాలను ఇలా మోసగిస్తున్నందుకు బాధగా ఉంది. దీనిపై నా లీగల్ టీమ్, చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది...

89

ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం అవసరమని నేను ఇలా సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నా...’ అంటూ ట్వీట్ చేశారు సచిన్ టెండూల్కర్...

99

వన్డే ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ మార్కును అందుకున్న మొట్టమొదటి భారత క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ చరిత్ర క్రియేట్ చేసిన రోజే, మాస్టర్‌ ఇలంటి పోస్ట్ చేయడం విశేషం...

click me!

Recommended Stories