నేనెప్పుడూ అలా చెప్పలేదు, గట్టిగా గాలి పీల్చుకోండి... ట్రోల్స్‌కి విరాట్ కోహ్లీ కౌంటర్...

First Published Jun 1, 2021, 2:46 PM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ట్రోలింగ్ కొత్తేమీ కాదు. ప్రస్తుత తరంలో అత్యధిక సెంచరీలు, పరుగులు చేసిన క్రికెటర్‌గా ఉన్న ఈ రన్‌మెషిన్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ఆ ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోని, కోహ్లీ తాజాగా ఓ ఫన్నీ ట్రోల్‌కి తన స్టైల్‌లో స్పందించాడు.

ఇంగ్లాండ్ వెళ్లేందుకు క్వారంటైన్‌లో గడుపుతున్న భారత సారథి విరాట్ కోహ్లీ, అభిమానులతో కలిసి ప్రశ్న సమాధానాల సెషన్ నిర్వహించాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లీకి ‘మీ డైట్ ఎలా ఉంటుంది’? అనే ప్రశ్న ఎదురైంది.
undefined
దీనికి ‘చాలా వెజిటేబుల్స్, కొన్ని గుడ్లు, రెండు కప్పుల కాఫీ, పప్పు, కినోవా, పాలకూర, దోశలు కూడా ఇష్టం. అయితే అన్నీ పరిమిత మోతాదులోనే’ అంటూ సమాధానం ఇచ్చాడు విరాట్ కోహ్లీ.
undefined
అయితే విరాట్ కోహ్లీ వేగన్ అని... కోడి గుడ్లతో పాటు పాలు, పాల ఉత్పత్తులు కూడా తీసుకోడని చాలారోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో వేగన్ అని చెప్పి, గుడ్లు తింటున్నావా? అంటూ కోహ్లీని ట్రోల్ చేయడం మొదలెట్టారు నెటిజన్లు.
undefined
విరాట్ కోహ్లీ ట్రోల్ చేస్తూ నెటిజన్లు ట్వీట్లు, పోస్టులు, మీమీలు వేయడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉండే విరాట్ కోహ్లీ, ఈ ట్రోలింగ్‌ను గమనించాడు. గమనించడమే కాకుండా దానికి సమాధానం కూడా తన స్టైల్‌లో ఇచ్చాడు.
undefined
‘నేనెప్పుడూ వేగన్‌ని అని చెప్పలేదు. ఎప్పుడూ వెజిటేరియన్‌ అని మాత్రమే చెబుతూ వచ్చాడు. కాబట్టి గట్టిగా ఊపిరి పీల్చుకోండి. మీ వెగ్గీ తినండి... అది కూడా తినాలనుకుంటే...’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను పోస్టు చేశాడు విరాట్ కోహ్లీ.
undefined
విరాట్ కోహ్లీ చేసిన ఈ కామెంట్‌తో అందరూ అవాక్కవుతున్నారు. విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటాడని తెలుసు కానీ మరీ ఇంతలా ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తాడా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.
undefined
‘2018లో సౌతాఫ్రికా టూర్‌లో నాకు తీవ్రమైన వెన్నునొప్పి వచ్చింది. ఆ తర్వాత నా చిటికెన వేలికి తిమ్మర్లు వచ్చాయి. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇదంతా జరగడంతో బ్యాటింగ్ చాలా కష్టమైంది. అప్పుడు యాసిడిక్ సమస్య కూడా.
undefined
దీనంతటికీ మాంసాహారం ఎక్కువగా తినడమే కారణమని డాక్టర్లు సూచించారు. అందుకే అప్పటి నుంచి మాంసాహారానికి దూరంగా ఉన్నా’ అంటూ 2019లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ.
undefined
అయితే అనుష్క శర్మను పెళ్లాడిన తర్వాత విరాట్ కోహ్లీ పూర్తి వెజిటేరియన్‌గా మారిపోయాడని, భార్యలాగే పాలు, పాల ఉత్పత్తులకు కూడా దూరంగా ఉంటూ వేగన్‌లా తయారయ్యాడంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.
undefined
click me!