కోహ్లీని పెళ్లిచేసుకునేందుకు అనుష్క పెట్టిన కండీషన్ ఇదేనట... సీక్రెట్ చెప్పిన హీరోయిన్...

First Published Mar 9, 2021, 12:57 PM IST

ప్రపంచంలోనే వంద మిలియన్ల ఫాలోవర్లను కలిగిన మొట్టమొదటి క్రికెటర్ విరాట్ కోహ్లీ. దేశంలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. మూడేళ్ల వివాహ బంధం తర్వాత విరాట్ కోహ్లీని ఎందుకు పెళ్లాడాలిందో సీక్రెట్ బయటపెట్టింది అనుష్క శర్మ...

2017, డిసెంబర్ 11న పెళ్లి చేసుకున్న అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలకు అప్పుడు సరిగ్గా 29 ఏళ్లు. నిజానికి విరాట్ కోహ్లీ కంటే అనుష్క శర్మ ఆరు నెలలు పెద్ద కూడా. అనుష్క శర్మ 1988, మే 1న జన్మిస్తే, విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988న జన్మించాడు...
undefined
ఇటలీలో అత్యంత ఘనంగా జరిగిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల పెళ్లికి అతికొద్ది బంధుమిత్రులు, ఆప్తులు మాత్రమే హాజరయ్యారు. అయితే 29 ఏళ్ల వయసులో పెళ్లికి అంగీకరించేముందు కోహ్లీకి ఓ కండీషన్ పెట్టిందట అనుష్క శర్మ...
undefined
‘29 ఏళ్లకే పెళ్లి అంటే, చాలా చిన్న వయసులో పెద్ద నిర్ణయం తీసుకుంటున్నట్టు అనిపించింది. ముఖ్యంగా హీరోయిన్‌కి పెళ్లి తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. హీరోయిన్‌గా మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం కూడా రిస్కే...
undefined
ప్రేక్షకులు, హీరో హీరోయిన్లను ఎప్పుడూ తెరపై యంగ్‌గా చూడాలని అనుకుంటారు. అంతేకాకుండా పెళ్లి కాగానే పిల్లల్ని కనాలి, తల్లిగా బాధ్యతలు తీసుకోవాలనే ఆలోచన నుంచి అందరూ బయటికి రావాలి...
undefined
విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకుందామని అడగ్గానే, నేను ఒక కండీషన్ పెట్టాను. నాకు, నా వ్యక్తిగత జీవితానికి గౌరవం ఉండాలి... అని! దానికి విరాట్ ఎప్పుడూ అడ్డు చెప్పడని తెలుసు... ’ అంటూ చెప్పుకొచ్చింది అనుష్క శర్మ..
undefined
పెళ్లికి ముందు నాలుగేళ్ల పాటు డేటింగ్ చేశారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. పెళ్లైన తర్వాత బిజీ షెడ్యూల్ కారణంగా మొదటి ఏడాది కేవలం 22 రోజులు మాత్రమే కలిసి ఉన్నామని ప్రకటించింది విరుష్క జోడి...
undefined
కరోనా కారణంగా క్రికెట్‌కి, సినిమాలకు బ్రేక్ పడడంతో ఈ ఇద్దరూ కలిసి గడపడానికి కావాల్సినంత సమయం దక్కింది. లాక్‌డౌన్ గర్భం దాల్చిన అనుష్క శర్మ, జనవరి 11న ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే..
undefined
తమ కూతురికి వామిక అని నామకరణం చేశారు విరాట్, అనుష్క. నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూతురికి, అనుష్కకి శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ పోస్టు చేశాడు విరాట్ కోహ్లీ...
undefined
click me!