టీ20 వరల్డ్ కప్ 2021 నుంచే పాఠాలు నేర్చుకున్నా! నా టార్గెట్ అదే... - రోహిత్ శర్మ...

First Published Aug 11, 2022, 4:13 PM IST

టైటిల్ ఫెవరెట్‌గా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ బరిలో దిగిన భారత జట్టు, మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడి గ్రూప్ స్టేజీకే పరిమితమైంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తైన భారత జట్టు, న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడడమే ఇష్టం లేదన్నట్టుగా ఆడింది. ఈ టోర్నీ నుంచి తాను పాఠాలు నేర్చుకున్నానని కామెంట్లు చేస్తున్నాడు ప్రస్తుత సారథి రోహిత్ శర్మ...

rohit sharma

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ పరాభవం తర్వాత జస్ప్రిత్ బుమ్రా, ఐపీఎల్ ఆడిన తర్వాత సరైన రెస్ట్ లేకుండా వరల్డ్ కప్ ఆడించారని... అందుకే ప్లేయర్లు అలిసిపోయారని చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి... 

ROHIT

‘టీ20 వరల్డ్ కప్ 2021 నుంచి ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నా. ముఖ్యంగా ప్లేయర్లకు వర్క్ లోడ్ లేకుండా చూసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు ఆడే మ్యాచుల సంఖ్య బాగా పెరిగింది. గాయాలవ్వడం సహజం...

Rohit Sharma Asia Cup

అందుకే ప్లేయర్లను రొటేషన్ పద్ధతిలో వాడుకోవడం చాలా అవసరం. అవకాశం వచ్చినప్పుడు ఆడడానికి సిద్ధంగా ఉండే రిజర్వు బెంచ్‌ని అత్యంత పటిష్టంగా మార్చాలనేది మా ముందున్న ప్రధాన లక్ష్యం...

భవిష్యత్తులో టీమిండియాని నడిపించగల సమర్థులైనవారిని ఎంచుకుంటేనే భారత జట్టును సేఫ్ హ్యాండ్స్‌లో పెట్టడానికి వీలుంటుంది. ఎవ్వరి నుంచి ఏదో ఆశించడం లేదు. ఏ ఒక్కరి పైనా భారం లేకుండా సమిష్టగా ఆడే టీమ్‌ని తయారుచేయాలనేదే మా ముందున్న లక్ష్యం...

Image credit: Getty

రోజురోజుకీ మేం మరింత మెరుగైన టీమ్‌గా మారడానికే ప్రయత్నిస్తున్నాం. అందులో సక్సెస్ అవుతున్నాం. రాహుల్ ద్రావిడ్ కోచ్‌ అయ్యాక, మేం ఇద్దరం కలిసి జట్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించాం...

Image credit: Getty

టీమిండియా ఆడే విధానాన్ని, ప్లేయర్ల యాటిట్యూడ్‌ని పూర్తిగా మార్చాలనే నిర్ణయం అప్పుడు తీసుకున్నదే. అగ్రెసివ్ అటాకింగ్ గేమ్ ఆడేటప్పుడు అన్ని సార్లు విజయాలు రాకపోవచ్చు, కానీ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం మాత్రం పెరుగుతూ ఉంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...
 

click me!