రోహిత్ శర్మ వారసుడిగా హార్ధిక్ పాండ్యానే కరెక్ట్... టీ20 కెప్టెన్సీ అతనికే ఇవ్వాలంటూ...

Published : Aug 11, 2022, 03:35 PM IST

లేటు వయసులో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ భారాన్ని మోస్తున్న రోహిత్ శర్మ, ఈ ఏడాది ఆడిన మ్యాచుల కంటే విశ్రాంతి తీసుకున్న మ్యాచులే ఎక్కువ. రోహిత్ శర్మను పూర్తి స్థాయి కెప్టెన్‌గా ప్రకటించిన తర్వాత ఈ ఏడాది భారత జట్టుకి ఏకంగా ఏడుగురు కెప్టెన్లు మారారు...

PREV
16
రోహిత్ శర్మ వారసుడిగా హార్ధిక్ పాండ్యానే కరెక్ట్... టీ20 కెప్టెన్సీ అతనికే ఇవ్వాలంటూ...
Image credit: Getty

34 ఏళ్ల రోహిత్ శర్మ, ఇంకా ఎంత కాలం క్రికెట్‌లో కొనసాగుతాడో చెప్పడం కష్టం. చాలామంది క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా ప్రకారం 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ... కెప్టెన్సీ నుంచి తప్పుకోవచ్చని టాక్ బలంగా వినబడుతోంది...

26
Image credit: PTI

హార్ధిక్ పాండ్యా తర్వాత టీమిండియా పగ్గాలు తీసుకునే సరైన ప్లేయర్ కోసం వెతుకులాట మొదలెట్టిన బీసీసీఐ, ఇప్పటికే కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా వంటి యంగ్ ప్లేయర్లకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించి, ప్రయోగాలు చేసింది...

36
Image credit: Getty

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ నెగ్గిన హార్ధిక్ పాండ్యా, వెస్టిండీస్ టూర్‌లో ఐదో టీ20లోనూ కెప్టెన్‌గా మెప్పించాడు. అదీకాకుండా రిషబ్ పంత్, కెఎల్ రాహుల్‌లతో పోలిస్తే హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా ఐపీఎల్ టైటిల్ కూడా సాధించాడు...

46

‘ఆసియా కప్ టోర్నీకి కెఎల్ రాహుల్‌ని వైస్ కెప్టెన్‌గా ప్రకటించడం కూడా కాస్త నిరుత్సాహపడ్డాను. ఎందుకంటే టీ20 టీమ్‌ని నడిపించడంలో హార్ధిక్ పాండ్యా ఇప్పటికే సక్సెస్‌ఫుల్ అయ్యాడు...

56

ఇప్పటికే అతను మూడు మ్యాచుల్లో భారత జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. మూడు సార్లు కూడా మూడు భిన్నమైన టీమ్స్‌తో విజయాలు అందుకున్నాడు. ఆరు నెలల క్రితం చూస్తే హార్ధిక్ పాండ్యా, టీమిండియా కెప్టెన్సీ రేసులో ఉంటాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది...

66

ఐపీఎల్ టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యా, కెప్టెన్సీ రేసులో మిగిలిన ప్లేయర్లను వెనక్కి నెట్టేశాడు. కాబట్టి రోహిత్ శర్మ తర్వాత టీ20 కెప్టెన్సీ పగ్గాలు హార్ధిక్ పాండ్యాకి ఇవ్వడమే సరైన నిర్ణయం అవుతుంది.. ’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్...

Read more Photos on
click me!

Recommended Stories